పుష్ప విలన్ బాలీవుడ్ ఆరంగేట్రం.. క్రేజీ డైరెక్టర్‌తో..
జాతీయ అవార్డ్ గ్రహీత ఫహద్ ఫాసిల్ మళయాలంలో విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాల్లో నటించారు.
జాతీయ అవార్డ్ గ్రహీత ఫహద్ ఫాసిల్ మళయాలంలో విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాల్లో నటించారు. అతడు కమల్ హాసన్- సేతుపతి లాంటి గ్రేట్స్ స్టార్స్ తో కలిసి `విక్రమ్` లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పుష్ప ఫ్రాంఛైజీలో అల్లు అర్జున్‌తో పోటీపడుతూ అతడు నటించాడు. ఇటీవల విడుదలైన `పుష్ప 2` బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలో ఫారెస్ట్ ఆఫీసర్ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో అద్భుత నటనతో అతడు అభిమానుల మనసులు గెలుచుకున్నారు.
ఇంతలోనే ఫహద్ నటించే తదుపరి సినిమా ఖరారైంది. అతడు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ అలీతో ప్రయోగాత్మక సినిమాకి సంతకం చేసారు. ఈ చిత్రానికి మేకర్స్ ఆసక్తికర టైటిల్ ని ఫిక్స్ చేసారు. తాజా సమాచారం మేరకు.. ఈ చిత్రానికి `ఇడియట్స్ ఆఫ్ ఇస్తాంబుల్` అనే టైటిల్ ను ఖరారు చేశారని సమాచారం. ఫహద్ - ఇంతియాజ్ అలీ కలయికలో ఇది మొట్టమొదటి సినిమా. ఇంతియాజ్ అలీ గతంలో లవ్ ఆజ్ కల్, హైవే, రాక్ స్టార్, జబ్ వియ్ మెట్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించారు. పాపులర్ పంజాబీ గాయకుడు అమర్ సింగ్ చంకీలా బయోపిక్ కి ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్నారు. అందువల్ల ఫహద్ ఫాజిల్ లాంటి విలక్షణమైన స్టార్ తో అతడు ఎలాంటి సినిమా చేయబోతున్నాడో చూడాలన్న క్యూరియాసిటీ అభిమానుల్లో ఉంది.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్ సరసన యానిమల్ ఫేం ట్రిప్తి దిమ్రీ కథానాయికగా ఎంపికైందని టాక్ వినిపిస్తోంది. ట్రిప్తి ఇటీవల వరుసగా సీక్వెల్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు ఫహద్ లాంటి క్రేజీ స్టార్ సరసన అవకాశం అందుకోవడం తన కెరీర్‌కి ప్లస్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.