ఆ కండీషన్స్ పెడితే ఫాహద్ సినిమా చేయడా..?
ఐతే ఫాహద్ లుక్ చూస్తే అసలు హీరో మెటీరియల్ కాదనేలా ఉంటుంది. టాలెంట్ ఉంటే చాలు లుక్ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఫాహద్ ప్రూవ్ చేశాడు.
మలయాళ నటులు చాలా సహజంగా నటిస్తారన్న మాట ఎక్కువ వినిపిస్తుంది. అక్కడ మేకర్స్ ఎంచుకునే కథలు కమర్షియాలిటీకి దూరంగా సహజత్వానికి దగ్గరగా ఉంటాయి అందుకే అక్కడ నటీనటులు కూడా చాలా న్యాచురల్ గా అనిపిస్తారు. అలాంటి న్యాచురల్ నటనతో ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ ఆడియన్స్ ని తన ఫ్యాన్స్ గా మార్చుకున్నాడు ఫాహద్ ఫాజిల్. తండ్రి ఫాజిల్ డైరెక్టర్ అయినా కూడా కెరీర్ మొదట్లో ఆయనతో చేసిన సినిమా సక్సెస్ అవ్వకపోవడంతో మలి ప్రయత్నంగా ఆయన సపోర్ట్ తో కాకుండా సొంత టాలెంట్ తో సత్తా చాటుతూ వస్తున్నాడు ఫాహద్ ఫాజిల్.
ఫాజిల్ సలహా మేరకు నటుడిగా తొలి సినిమా చేయగా అది ఫ్లాప్ అవ్వడంతో విపరీతమైన విమర్శలు ఎదుర్కొన్నాడు ఫాహద్. అందుకే ఇక సినిమాలు తన వల్ల కాదని అమెరికా వెళ్లి చదువుకోవాలని అనుకున్నాడు. కానీ సినిమాలో ఫెయిల్యూర్ అవ్వడం అతన్ని చదువు మీద శ్రద్ధ చూపేలా చేయలేదు. ఆ టైం లో 9/11 ఉదంతంతో తెరకెక్కిన యు హోతా తో క్యా హోతా అనే సినిమా చూసి ఫాహద్ లో మార్పు వచ్చింది.
ఆ సినిమాలో ఆరుగురి జీవితాలు దాడుల వల్ల అనుకోని ప్రమాదాల్లో పడి ఏమీ సాధించకుండానే జీవితాన్ని ముగిస్తారు. ఆ సినిమా చూసి అంతా సాఫీగా ఉన్న తాను ఇలా ఓటమిని అంగీకరించడం కరెక్ట్ కాదని యాక్టింగ్ కోర్స్ లు చేసి 7 ఏళ్ల తర్వాత కొచ్చికి వచ్చి మళ్లీ సినిమాలు ప్రయత్నించాడు ఫాహద్ ఫాజిల్. ముందు రెండేళ్లు సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తూ వచ్చి ఆ తర్వాత లీడ్ రోల్స్ చేయడం మొదలు పెట్టాడు. ఐతే బలమైన దృడ సంకల్పంతో వచ్చాడు కాబట్టి ఈసారి అతని నటనకు విమర్శలు కాదు లెక్కనేనన్ని ప్రశంసలు వచ్చాయి.
సినిమా వెంట సినిమాలు సక్సెస్ అవుతూ వచ్చాయి. తన అభిరుచికి తగిన సినిమాలే కాదు ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు ఫాహద్ ఫాజిల్. మలయాళం లో అతని సినిమాలు చూసిన తమిళ, తెలుగు మేకర్స్ ఇక్కడ సినిమాల్లో కూడా ఫాహద్ కి ఛాన్స్ లు ఇస్తున్నారు. అలా కమల్ హాసన్ విక్రం, రజినీకాంత్ జైలర్ సినిమాల్లో ఛాన్స్ లు వచ్చాయి.
ఐతే ఫాహద్ లుక్ చూస్తే అసలు హీరో మెటీరియల్ కాదనేలా ఉంటుంది. టాలెంట్ ఉంటే చాలు లుక్ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఫాహద్ ప్రూవ్ చేశాడు. అంతేకాదు చాలా సినిమాలు అతనికి విగ్ పెట్టి నటింప చేయాలని చూడగా తాను ఎలా ఉన్నానో అలానే ఉంటా.. విగ్ పెట్టుకోవడం కంపల్సరీ అయితే సినిమాలు చేయనని తన దాకా వచ్చిన వాటిని కూడా కాదన్నాడు ఫాహద్ ఫాజిల్.
ప్రస్తుతం పుష్ప 2 లో భన్వర్ సింగ్ షెఖావత్ పాత్రలో నటించిన ఫాహద్ ఆ సినిమాలో తన పాత్ర ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుందని చెబుతున్నాడు . అల్లు అర్జున్ తో సమానమైన తన పాత్ర అందరికీ నచ్చుతుందని అన్నాడు. ఫాహద్ లాంటి విలక్షణ నటులను ఎంకరేజ్ చేస్తూ తెర మీద ఇంకా మరిన్ని అద్భుతమైన కథలు సినిమాలు చూసే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.