షెకావ‌త్ స‌ర్ తో యానిమ‌ల్ బ్యూటీ రొమాన్స్!

ఈ నేప‌థ్యంలో ఫ‌హాద్ పాజిల్ బాలీవుడ్ లోకి ఎంట‌ర్ అవుతున్నాడు. ఇంతియాజ్ అలీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. 'ఇడియ‌ట్స్ ఆఫ్ ఇస్తాంబుల్' అనే టైటిల్ తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

Update: 2024-12-12 06:17 GMT

ఫ‌హాద్ ఫాజిల్ ఇప్పుడు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. మాలీవుడ్ లో ఎంతో పెద్ద స్టార్ అయినా? తన స్టార్ డ‌మ్ రెట్టింపు అవ్వ‌డానికి కార‌ణం మాత్రం టాలీవుడ్ అన్న‌ది వాస్త‌వం. 'పుష్ప' సినిమాలోకి ప‌హాద్ ఎంట‌ర్ అయిన త‌ర్వాత న‌టుడిగా ఫ‌హాద్ కెరీర్ కొత్త ట‌ర్నింగ్ తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మ‌ల‌యాళంలో న‌టించిన సినిమాలు సౌత్ లో అన్ని భాష‌ల్లోనూ అనువాదం అవ్వ‌డం మొద‌లైంది. అప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న సినిమాలు కేవ‌లం మాలీవుడ్ కే ప‌రిమిత‌మ‌య్యేవి.

కానీ నేడు ద‌క్షిణాదిన అన్ని భాష‌ల్లో రిలీజ్ అవుతున్నాయి. 'పుష్ప ది రైజ్' రిలీజ్ అయిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ మూడు నాలుగు సినిమాలొచ్చాయి. వాటికి ఇక్క‌డా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక 'పుష్ప‌-2' విజ‌యంతో అన్ని భాష‌ల్లోనూ తిరుగు లేకుండా పోయింది. ఈ నేప‌థ్యంలో ఫ‌హాద్ పాజిల్ బాలీవుడ్ లోకి ఎంట‌ర్ అవుతున్నాడు. ఇంతియాజ్ అలీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. 'ఇడియ‌ట్స్ ఆఫ్ ఇస్తాంబుల్' అనే టైటిల్ తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

ఇందులో ఫహాద్ కి జోడీగా యానిమ‌ల్ బ్యూటీ త్రిప్తీ డిమ్రీని హీరోయిన్ గా ఎంపిక చేయ‌డం విశేషం. ఇదొక రొమాంటిక్ కామెడీ చిత్రం. హీరో-హీరోయిన్ మ‌ధ్య కొన్ని ఇంటిమేట్ స‌న్నివ‌శాలు ఉన్నాయ‌ని అంటున్నారు. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. వ‌చ్చే ఏడాది సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమాతో ఫ‌హాద్ హిందీకి వెళ్ల‌డం పై ఆయ‌న సంతోషం వ్య‌క్తం చేసారు. చాలా కాలంగా హిందీ సినిమాలు చేయాల‌నుకున్నా? అవ్వ‌లేదు. ఆ అవ‌కాశం ఇప్పుడు ల‌భించింది. న‌టుడిగా ఏ భాష‌లో అవ‌కాశం వ‌చ్చిన వ‌ద‌ల‌ను. అన్ని భాష‌ల్లోనూ సినిమాలు చేసిన‌ప్పుడే ర‌క‌ర‌కాల పాత్ర‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌న్నారు.

Tags:    

Similar News