క్లిక్‌ క్లిక్‌ : స్టార్‌ కపుల్‌ ఆగస్ట్‌ హంగామా

మలయాళ స్టార్‌ నటుడు ఫహద్‌ ఫాసిల్‌ కి టాలీవుడ్‌ తో పాటు అన్ని భాషల్లో కూడా మంచి క్రేజ్ ఉంది.

Update: 2024-09-02 20:30 GMT

మలయాళ స్టార్‌ నటుడు ఫహద్‌ ఫాసిల్‌ కి టాలీవుడ్‌ తో పాటు అన్ని భాషల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. తక్కువ సమయంలోనే అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ పాన్‌ ఇండియా స్టార్‌ అనిపించుకున్న ఫహద్‌ ఫాసిల్‌ ప్రస్తుతం పుష్ప 2 లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఫహద్‌ జీవిత భాగస్వామి అయిన హీరోయిన్ నజ్రియా నజీమ్‌ కూడా వరుస సినిమాలతో సందడి చేస్తోంది. తమిళ్‌, మలయాళ సినిమా ఇండస్ట్రీలో నజ్రియా కి మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. తెలుగు లో ఒక్క సినిమా కూడా చేయకుండానే మంచి గుర్తింపు దక్కించుకున్న నజ్రియా ఆ మధ్య నానితో కలిసి అంటే సుందరానికి సినిమా ను చేసింది.

నానితో కలిసి చేసిన ఆ సినిమా కి కమర్షియల్‌ గా మంచి సక్సెస్ దక్కలేదు. హీరోయిన్‌ గా నజ్రియా నజీమ్‌ కి తెలుగు లో చాలా ఆఫర్లు వచ్చినా కూడా వాటన్నింటిని సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చింది. తెలుగు లో మరో మంచి సినిమా తో రీ ఎంట్రీ ఇవ్వాలని వెయిట్‌ చేస్తున్నట్లుగా ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్‌ అరవ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా తన అందమైన ఫోటోలతో పాటు, రెగ్యులర్‌ టూర్‌ కి సంబంధించిన పిక్స్‌ ను షేర్‌ చేస్తూ ఉంటుంది, తన భర్త ఫోటోలను కూడా నజ్రియా సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటుంది.

తాజాగా నజ్రియా ఆగస్టు నెలకు సంబంధించిన ఇంట్రస్టింగ్‌ సంఘటనల ఫోటోలను షేర్ చేసింది. నెల పూర్తి అయిన తర్వాత ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు ఇలా గత నెల తాలూకు జ్ఞాపకాలను నెమరవేస్తూ షేర్‌ చేస్తున్నారు. గత నెలలో సోషల్‌ మీడియాలో షేర్ చేసి మంచి ఆధరణ దక్కించుకున్న ఫోటోలతో పాటు మరి కొన్ని ఫోటోలను కూడా నజ్రియా షేర్ చేసింది. నజ్రియా షేర్‌ చేసిన క్యూట్‌ అండ్‌ బ్యూటీఫుల్‌ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. హీరోయిన్‌ గా ఎంత బిజీగా ఉన్నా కూడా తన భార్య రోల్‌ ను ఆమె పూర్తి స్థాయిలో నెరవేరుస్తూ ఉంటుందని ఒకానొక సమయంలో ఫహద్‌ చెప్పుకొచ్చాడు.

సౌత్‌ లో మోస్ట్‌ బ్యూటీఫుల్‌ స్టార్‌ కపుల్స్ లో ఒకరుగా ఫహద్‌ ఫాసిల్‌, నజ్రియా నజీమ్‌ జంట నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. ముందు ముందు వీరిద్దరు కలిసి నటించాలని నెటిజన్స్‌, సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు. 2014 లో వీరి వివాహం జరిగింది. వీరి పదేళ్ళ వైవాహిక జీవితం చాలా సంతోషంగా సాగిందని ఇలాంటి ఫోటోలు చెప్పకనే చెబుతున్నాయి. సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్స్‌ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించరు. కానీ గత పదేళ్లుగా నజ్రియా నజీమ్‌ హీరోయిన్‌ గా వరుస సినిమాలు చేస్తూనే ఉంది. నజ్రియా తో పాటు ఫహద్‌ కూడా సినిమా ఇండస్ట్రీలో దూసుకు పోతున్నారు.

Tags:    

Similar News