పుష్ప 2 vs ఆవేశం.. ఆయన ఆలోచన ఎలా ఉందంటే..
అయితే ఫాహాద్ పుష్ప సినిమాకి అలాగే ఆవేశం కాన్సెప్ట్ కు ఉన్న వ్యత్యాసాన్ని తనదైన శైలిలో తెలియజేశాడు
మలయాళం ఇండస్ట్రీలోనే కాకుండా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో ఫాహాద్ ఫాజల్ మంచి గుర్తింపును అందుకుంటున్నాడు. పుష్ప సినిమాలో అతను కనిపించింది కొంచెం సేపే అయినప్పటికీ కూడా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఇక సెకండ్ పార్ట్ లో అతను పుష్ప రాజ్ ను ఎదుర్కొనే తీరు మరింత హైలెట్ గా ఉండబోతున్నట్లు ఇదివరకే క్లారిటీ వచ్చింది.
అంతేకాకుండా ప్రస్తుతం అతనికి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఆఫర్లు గట్టిగానే వస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ స్టార్ యాక్టర్ మాత్రం తొందరపడకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్ గా అతని సొంత భాషలో వచ్చిన ఆవేశం సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ ను అందుకుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు.
అయితే ఫాహాద్ పుష్ప సినిమాకి అలాగే ఆవేశం కాన్సెప్ట్ కు ఉన్న వ్యత్యాసాన్ని తనదైన శైలిలో తెలియజేశాడు. పుష్ప సినిమా బ్యాక్ డ్రాప్ కాన్సెప్ట్ అయితే ఎలాంటి బ్యాక్ డ్రాప్ లో అయినా సరే సెట్ అవుతుంది అని, కానీ ఆవేశం సినిమా మాత్రం అలా కాకుండా బెంగళూరు బ్యాక్ డ్రాప్ లోనే తెరపైకి తీసుకురావాల్సి ఉంటుంది అని తెలియజేశాడు.
ఒక విధంగా ఆవేశం సినిమాలో కమర్షియల్ యాంగిల్ ఎక్కువగా ఉన్నప్పటికీ దాని మూలం మాత్రం బెంగళూరులోనే ఉండే విధంగా కథను డెవలప్ చేయడం జరిగిందట్లుగా తెలియజేశాడు. ఇక పుష్ప సినిమా ఒక అడవిలో కాకుండా మరొక బ్యాక్ డ్రాప్ లో అదే తరహాలో హీరోయిజాన్ని ఎలివేట్ చేయొచ్చు అని తెలియజేశాడు. అయితే ఈ విషయంలో ఫ్యాన్స్ నుంచి కూడా విభిన్నమైన తరహాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి దర్శకుడు సుకుమార్ ఆ కథను గంధపు చెట్ల స్మగ్లింగ్ కు అడ్డా ఆగినటువంటి చిత్తూరు జిల్లాను ఏదో నామమాత్రంగా ఎందుకోలేదు. స్మగ్లింగ్ అక్కడ ఎప్పటినుంచో కొనసాగుతున్నదే. కాబట్టి అసలు కథ అక్కడి నుంచి పుట్టింది. దాన్ని మరొక బ్యాక్ డ్రాప్ లో సెలెక్ట్ చేసుకున్న కూడా ఆడియన్స్ కి అంత తొందరగా కరెక్ట్ కాకపోవచ్చు అనే విధంగా అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి.
ఇక ఈ నటుడు పుష్ప 2 సినిమాలో చేస్తున్న భన్వర్ సింగ్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ క్యారెక్టర్ సెకండ్ పార్ట్ లో మరింత బలంగా ఉండబోతున్నట్లుగా అర్థమవుతుంది. అలాగే మరొక ప్రముఖ నటుడు కూడా సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఇదివరకే కొన్ని గాలిప్స్ వచ్చాయి. దర్శకుడు సుకుమార్ అంతకుమించి అనేలా పుష్ప 2 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇక సినిమాను ఆగస్టు 15వ తేదీన గ్రాండ్ కి విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.