చీవాట్లు..దెబ్బ‌లు తిన్న త‌ర్వాత హీరోలో రియ‌లైజేష‌న్!

ఇవ‌న్నీ ఆన్సెట్స్ లో స‌హ‌జం. తాజాగా బాలీవుడ్ న‌టుడు ప‌హ్మాన్ ఖాన్ కూడా ద‌ర్శ‌కుడి నోట తిట్లు తిన్న వాడినేన‌ని అన్నాడు

Update: 2024-07-23 04:30 GMT

ఆన్ సెట్స్ లో కొత్త న‌టీన‌టుల‌తో ఎలాంటి ఇబ్బందులుంటాయో చెప్పాల్సిన ప‌నిలేదు. స‌రిగ్గా న‌టించ క‌పోవ‌డం..డైలాగ్ లు చెప్ప‌క‌పోవ‌డం..ఎక్స్ ప్రెష‌న్స్ స‌వ్యంగా ఇవ్వ‌క‌పోండం ఇలా చాలా విష‌యాల్లో డైరెక్ట‌ర్ స‌హానాన్ని న‌టీన‌టులు ప‌రీక్షిస్తుంటారు. అలాంటి స‌మ‌యంలో ద‌ర్శ‌కులు సైతం స‌హ‌నం కోల్పోతుంటారు. న‌టుల‌పై సీరియ‌స్ అయ్యేవ‌రు కొంద‌రైతే తిట్టేవారు మ‌రికొంత‌మంది. ఇంకొంత కోపంలో చేయిసైతం చేసుకుంటారు.

ఇవ‌న్నీ ఆన్సెట్స్ లో స‌హ‌జం. తాజాగా బాలీవుడ్ న‌టుడు ప‌హ్మాన్ ఖాన్ కూడా ద‌ర్శ‌కుడి నోట తిట్లు తిన్న వాడినేన‌ని అన్నాడు. `ఇష్క్ మే జ‌ర్దావ‌న్` సీరియ‌ల్ సెట్ లో త‌న‌కెదురైన అనుభ‌వాన్ని పంచుకున్నాడు. `ఒక రోజు ఉద‌యం 9 పేజీల స్క్రిప్ట్ ఇచ్చారు. అది చ‌దివి మ‌ధ్నాహ్నానికి రెడీ అవ్వాలి. అదంతా చ‌దివి ఎలా గుర్తు పెట్టుకోవాలో అర్దం కాలేదు. షూటింగ్ మొద‌ల‌య్యాక ఎనిమిది టేక్ లు తీసుకున్నాను. దీంతో ద‌ర్శ‌కుడికి కోపం వ‌చ్చింది.

అస‌లు వీడిని ఎవ‌రు తీసుకొచ్చారు? డైలాగులు కూడా గుర్తు ఉండ‌టం లేదని స‌హ‌నం కోల్పోయి నోటికొచ్చిన‌ట్లు తిట్టారు. నేను మాత్రం అక్క‌డ వాటిని అంద‌రి ముందు భ‌రించాను. త‌ర్వాత రూమ్ కొచ్చి డోర్ క్లోజ్ చేసి పెట్టుకున్న‌ బెల్ట్ తీసుకుని న‌న్ను నేనే కొట్టుకున్నాను. ద‌ర్శ‌కుడిగా అత‌ని త‌ప్పు లేదు. న‌టులుగా వాళ్లు చెప్పింది చేయాలి. అందులో నేను ఫెయిల‌య్యాన‌ని రియ‌లైజ్ అయ్యాను.

ఆ త‌ర్వాత బాగా చ‌దివి కెమెరా ముందుకెళ్లి న‌టించాను. ప‌ర్పెక్ట్ గా వ‌చ్చింది. దీంతో తిట్టిన ద‌ర్శ‌కుడే మెచ్చుకున్నాడు. తిన్న దెబ్బ‌ల‌న్నీ మ‌ర్చిపోయాను` అని అన్నాడు. ప్ర‌స్తుతం ప‌హ్మాన్ ఖాన్ ప‌లు షూటింగ్ ల‌తో బిజీగా ఉన్నాడు. బుల్లి తెర‌పై బాగా ఫేమ‌స్ అయిన న‌టుడీయ‌న‌.

Tags:    

Similar News