అజిత్ నెక్ట్స్ ఎవ‌రితో?

ఈ నేప‌థ్యంలో అజిత్ త‌న త‌ర్వాతి సినిమాను ఎవ‌రి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నాడ‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

Update: 2025-02-15 21:30 GMT

రీసెంట్ గా విడాముయార్చి సినిమాతో ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించిన అజిత్, ఆ సినిమాతో రూ.120 కోట్ల‌కు పైగా క‌లెక్ట్ చేశాడు. విడాముయార్చి త‌ర్వాత అజిత్, అధిక్ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా చేశాడు. ఈ సినిమాలో అజిత్ కు జోడీగా త్రిష న‌టిస్తుంది. టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

ఏప్రిల్ 10వ తేదీన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈ సినిమాకు జీవీ ప్ర‌కాష్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని వ‌ర్క్స్ ను కంప్లీట్ చేసిన అజిత్ ఇప్పుడు కార్ రేసింగ్ పై దృష్టి పెట్టాడు. గ‌త నెల‌లో దుబాయ్ లో జ‌రిగిన కార్ రేస్ లో పార్టిసిపేట్ చేసిన ఆయ‌న టీమ్ మూడో ప్లేస్ లో నిలిచింది.

అక్టోబ‌ర్ వ‌ర‌కు కార్ రేసింగ్ లో బిజీ ఉండ‌నున్న కార‌ణంగా సినిమాల‌కు గ్యాప్ ఇస్తున్నట్టు అజిత్ ఇప్ప‌టికే అనౌన్స్ చేశాడు. అయిన‌ప్ప‌టికీ త‌న త‌ర్వాతి సినిమా ఏకే64 కోసం అజిత్ కథ‌లు వింటున్నాడు. ఈ నేప‌థ్యంలో అజిత్ త‌న త‌ర్వాతి సినిమాను ఎవ‌రి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నాడ‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

అయితే అజిత్ ను నెక్ట్స్ డైరెక్ట్ చేయ‌బోయే డైరెక్ట‌ర్ ఇత‌నే అంటూ రోజుకొక డైరెక్ట‌ర్ పేరు వార్త‌ల్లో నిలుస్తోంది. త‌న‌కు బిల్లాతో మంచి హిట్ అందించిన విష్ణు వ‌ర్థ‌న్ పేరు వినిపిస్తుంది. గుడ్ బ్యాడ్ అగ్లీ డైరెక్ట‌ర్ అధిక్ కు అజిత్ మ‌రో ఛాన్స్ ఇచ్చాడ‌ని కొంద‌రంటుంటే, కార్తీక్ సుబ్బ‌రాజ్ చెప్పిన క‌థ అజిత్ ను ఇంప్రెస్ చేసింద‌ని మ‌రికొంద‌రంటున్నారు.

మ‌హారాజా డైరెక్ట‌ర్ నిథిల‌న్ సామినాథన్ అజిత్64కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని కొంద‌రంటుండ‌గా, కంగువ డైరెక్ట‌ర్ శిరుత్తై శివ, పోర్ తొళిల్ డైరెక్ట‌ర్ విఘ్నేష్ రాజా కు అజిత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వ‌డ‌మే లేట‌ని మ‌రికొందరంటున్నారు. మ‌రి వీరిలో ఎవ‌రితో అజిత్ త‌న నెక్ట్స్ సినిమాను చేయ‌నున్నాడో చూడాలి.

Tags:    

Similar News