మాస్ జాతర కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..!

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం చేస్తున్న సినిమా మాస్ జాతర. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను భాను భోగవరపు డైరెక్ట్ చేస్తున్నారు.

Update: 2025-01-06 04:45 GMT

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం చేస్తున్న సినిమా మాస్ జాతర. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను భాను భోగవరపు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు మాస్ జాతర టైటిల్ లాక్ చేశారు. రవితేజ లోని మాస్ ఎనర్జీని పర్ఫెక్ట్ గా వాడుకుని ఈ సినిమా చేస్తున్నట్టు చెబుతున్నారు. ధమాకా తర్వాత సోలోగా హిట్ కొట్టేందుకు నానా కష్టాలు పడుతున్నాడు రవితేజ. చేయడానికి క్రేజీ సినిమాలు చేస్తున్నా అందులో ఒక్కటి కూడా పర్ఫెక్ట్ హిట్ అందించట్లేదు. అందుకే ఈసారి టార్గెట్ అసలు మిస్ అవ్వకూడదని ఫిక్స్ అయ్యి ఈ సినిమా చేస్తున్నాడు.

సామజవరగమన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రైటర్ భాను డైరెక్షన్ లో వస్తున్న ఈ మాస్ జాతర ఫ్యాన్స్ కి నిజంగానే జాతర ఫీల్ తెచ్చేలా చేస్తుందని అంటున్నారు. అంతేకాదు ధమాకా కాంబో రిపీట్ చేస్తున్నారు కాబట్టి సినిమా ఆ రేంజ్ హిట్ అందుకుంటుందని అంటున్నారు. ధమాకాలో రవితేజ, శ్రీలీల కలిసి నటించారు. ఆ సినిమాలో ఇద్దరి జోడీ అదిరిపోయింది. మాస్ జాతరకి కూడా అలాంటి ఫలితం తెచ్చేలా చిత్ర యూనిట్ తెగ కష్టపడుతున్నారు.

అసలైతే సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ మధ్యలో ఈ సినిమా షూటింగ్ టైం లోనే రవితేజ షోల్డర్ కి దెబ్బ తగలడం వల్ల రెస్ట్ తీసుకున్నాడు. ఐతే మాస్ జాతర షూటింగ్ అప్డేట్స్ ఇంకా బయటకు రాలేదు. సినిమా కనీసం సమ్మర్ కైనా ప్రేక్షకుల ముందుకు తెస్తారా లేదా ఈ ఇయర్ సెకండ్ హాఫ్ కి సినిమా వాయిదా పడుతుందా అన్నది చూడాలి.

రవితేజ మార్క్ మాస్ సినిమా ఇస్తే పక్కా బ్లాక్ బస్టర్ అందుకుంది. ఐతే అలాంటి జడ్జిమెంట్ ఉన్న కథలు ఆయన దగ్గరకు రావట్లేదు. లాస్ట్ ఇయర్ చివరగా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా అయితే రవితేజని డిజప్పాయింట్ చేసింది. మరి మాస్ జాతర అయినా మాస్ రాజాకి హిట్ కిక్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి. సినిమా రిలీజ్ ఎప్పుడన్నది చెప్పకపోయినా కనీసం సినిమా అప్డేట్స్ అయినా ఇస్తే మాస్ రాజా ఫ్యాన్స్ ఖుషి అవుతారు. ఈ విషయంలో మేకర్స్ కాస్త దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ సినిమాతో పాటు రవితేజ మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టాడు. వాటి అనౌన్స్ మెంట్ త్వరలో రానున్నాయి.

Tags:    

Similar News