Begin typing your search above and press return to search.

పాపం చ‌ర‌ణ్ రైమ్ కి ఎంత ఇబ్బంది!

చ‌ర‌ణ్ ద‌గ్గ‌ర ఒక బుల్లి బుజ్జి ప‌ప్పీ ఉన్న సంగ‌తి తెలిసిందే. దీని పేరు రైమ్.

By:  Tupaki Desk   |   15 Sep 2024 3:39 PM GMT
పాపం చ‌ర‌ణ్ రైమ్ కి ఎంత ఇబ్బంది!
X

చ‌ర‌ణ్ ద‌గ్గ‌ర ఒక బుల్లి బుజ్జి ప‌ప్పీ ఉన్న సంగ‌తి తెలిసిందే. దీని పేరు రైమ్. చెర్రీ ఎక్క‌డ ఉంటే అక్క‌డ రైమ్ ఉంటుంది. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా అనుబంధం అలాంటిది. ఆ ఇద్ద‌రినీ విడివిడిగా చూడ‌లేం. కానీ అలాంటి గారాల ప‌ట్టీని ఇప్పుడు సెల్ఫీల పేరుతో అభిమానులు న‌లిపేసారు. సెల్ఫీ కోసం బ‌తిమాలుతూ ఒక‌రి చేతిలోంచి ఒక‌రు లాక్కుంటూ పాపం బుజ్జి రైమ్ కి చాలా ఇబ్బందిని క‌ల‌గజేసారు.

చూస్తుంటే ఆ పెట్ ఎంత‌గా బాధ‌ప‌డుతోందో క‌దా? అనిపిస్తోంది. అభిమానులు ఇలా అత్యుత్సాహంతో ఒక మూగ జీవాన్ని ఇంత‌గా ఇబ్బంది పెట్ట‌డం నెటిజ‌నుల‌కు న‌చ్చ‌లేదు. చ‌ర‌ణ్ అభిమానులు రైమ్ తో సెల్ఫీలు దిగేందుకు సృష్టించిన హంగామా చూసి చాలా మంది విమ‌ర్శ‌లు గుప్పించారు. పెట్స్ తో వ్య‌వ‌హ‌రించాల్సిన తీరు ఇది కాద‌ని విమ‌ర్శించారు. చివ‌రికి రైమ్ ని వారి నుంచి విడిపించి చ‌ర‌ణ్ స‌హాయ‌కుడు అక్క‌డి నుంచి ఉడాయించ‌డంతో అది బ‌య‌ట‌ప‌డింది కానీ, ఇంకా ఇంకా సెల్ఫీల కోసం వెంబ‌డించేవారు. ఐదు నుంచి ప‌దిమంది మెగా ఫ్యాన్స్ ఇలా చ‌ర‌ణ్ ఇంటి స‌మీపంలో గుమిగూడారు రైమ్ కోసం.

అభిమానులు తమ ఫేవ‌రెట్ స్టార్ తో ఫోటోలు సెల్ఫీలు దిగ‌డం ష‌రా మామూలే అయినా కానీ, ఇలా మూగ ప్రాణుల‌తో కూడా సెల్ఫీలు దిగాల‌నుకోవ‌డం కొంత వింతైన‌దే. కానీ ఒక ప్రాణిని అంత‌గా ఇబ్బంది పెట్ట‌డ‌మే స‌రికాదు. ఫ్యాన్స్ అభిమానం కొన్నిసార్లు సున్నిత‌మైన అంశాల్లో ఇబ్బందిక‌రంగా మారుతోంది. దీనిని త‌క్ష‌ణ‌మే వారు స్వీయ‌విమ‌ర్శ చేసుకోవాల‌ని సూచిస్తున్నారు.