మత్తు వదిలించే చిట్టి లుక్ చూశారా..!

2019లో వచ్చిన సూపర్‌ హిట్‌ క్రైమ్‌ కామెడీ చిత్రం మత్తు వదలరా కి సీక్వెల్‌ రూపొందింది.

Update: 2024-08-28 05:58 GMT

2019లో వచ్చిన సూపర్‌ హిట్‌ క్రైమ్‌ కామెడీ చిత్రం మత్తు వదలరా కి సీక్వెల్‌ రూపొందింది. మొదటి భాగంకు దర్శకత్వం వహించిన రితేష్ రానా దర్శకత్వంలోనే ఈ సీక్వెల్‌ రూపొందింది. మత్తు వదలరా 2 సినిమాలో శ్రీ సింహా, నరేష్ అగస్త్య లు హీరోలుగా నటించగా కమెడియన్ సత్య కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. వీరి ముగ్గురి కాంబోలో వచ్చే కామెడీ సన్నివేశాలు కచ్చితంగా ప్రేక్షకులను నవ్విస్తాయని, మరో విజయాన్ని దక్కించుకోవడం ఖాయం అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు.

సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మత్తువదలరా సినిమాలో జాతిరత్నాలు ఫేం చిట్టి అలియాస్ ఫరియా అబ్దుల్లా కీలక పాత్రలో కనిపించబోతుంది. పోలీస్ ఆఫీసర్ నిధి గా ఫరియా కనిపించబోతుంది. అందుకు సంబంధించిన పోస్టర్ ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఫరియా పర్సనాలిటీకి తగ్గట్లుగా నిధి పాత్ర లుక్ ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కామెడీ పాత్రలకు బాగా సెట్‌ అవుతున్న ఫరియా అబ్దుల్లా మరోసారి ఈ సినిమాలో కామెడీ తో అలరించే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా సీరియస్ ఆఫీసర్ గా, చేతిలో గన్ తో కనిపించి సర్‌ప్రైజ్ చేసింది.

జాతిరత్నాలు సినిమా తర్వాత ఫరియా అబ్దుల్లాకి చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఎక్కువ శాతం బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. కొన్ని సినిమాల్లో పెద్దగా ప్రాముఖ్యత లేని పాత్రల్లో కనిపించింది. కానీ మత్తువదలరా 2 సినిమాలో మాత్రం కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా ఫస్ట్‌ లుక్ పోస్టర్ ను చూస్తే అర్థం అవుతోంది. సూపర్‌ హిట్‌ మూవీ కి సీక్వెల్‌ అవ్వడంతో సహజంగానే మత్తువదలరా 2 పై అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

నిధి పాత్ర ఫస్ట్‌ లుక్ ను విడుదల చేసిన మేకర్స్ అతి త్వరలోనే టీజర్ ను కూడా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. విడుదల తేదీ సమీపిస్తున్న కారణంగా ఒకటి రెండు రోజుల్లోనే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా షురూ చేసే అవకాశాలు ఉన్నాయి. దర్శకుడు రితేష్ రానా గత సినిమాలో మాదిరిగానే ఈ సీక్వెల్‌ లో కూడా క్రైమ్‌ కామెడీ కథ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా మత్తు వదలరా 2 సినిమా ఉంటుందని హీరోలు శ్రీ సింహా మరియు నరేష్ అగస్త్య లు అన్నారు.

Tags:    

Similar News