ఫిబ్రవరి.. బాక్సాఫీస్ కు పెద్ద దెబ్బె!
తరువాత వచ్చిన ఈగల్ సినిమా పాజిటివ్ టాక్ తో ప్రారంభమైన ఆడియన్స్ ని థియేటర్స్ కి భారీ స్థాయిలో రప్పించడంలో విఫలం అయ్యింది.
జనవరి నెలలో హనుమాన్ రూపంలో టాలీవుడ్ కి భారీ హిట్ లభించింది. అలాగే నా సామిరంగా, గుంటూరు కారం కూడా నిర్మాతలని సేఫ్ జోన్ లోకి తీసుకెళ్లాయి. తరువాత ఆశించిన స్థాయిలో సక్సెస్ లు రాలేదు. ఫిబ్రవరి నెలలో అయితే టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక్క హిట్ కూడా పడలేదు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ మోస్తరుగా ఆడింది.
తరువాత వచ్చిన ఈగల్ సినిమా పాజిటివ్ టాక్ తో ప్రారంభమైన ఆడియన్స్ ని థియేటర్స్ కి భారీ స్థాయిలో రప్పించడంలో విఫలం అయ్యింది. మూవీకి బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ రాలేదు. యాత్ర 2 మూవీకి కూడా పాజిటివ్ టాక్ వచ్చిన బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపించలేదు. కేవలం ఒక పార్టీకి అనుకూలంగా తీసిన సినిమా కావడంతో పెద్దగా క్లిక్ కాలేదు.
సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ఊరుపేరు భైరవకోన సినిమా కూడా రిలీజ్ కి ముందు మంచి బజ్ క్రియేట్ చేసింది. పెయిడ్ ప్రీమియర్స్ కి కూడా మంచి స్పందన వచ్చింది. అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్ర సానుకూల ఫలితాల రాలేదు. ఎక్స్ పెక్ట్ చేసిన స్థాయిలో కలెక్షన్స్ రావడం లేదు. బ్రేక్ ఈవెన్ అందుకోవడం కూడా కష్టమే అనే మాట వినిపిస్తోంది.
కమెడియన్ హర్ష లీడ్ రోల్ లో వచ్చిన సుందరం మాస్టర్ మూవీ కూడా సోసోగానే ఉండిపోయింది. అర్జున్ రెడ్డి తరహాలోనే సిద్ధార్ధ్ రాయ్ అనే సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. ఈ మూవీ కూడా మంచి బజ్ క్రియేట్ చేసింది. అర్జున్ రెడ్డి తరహాలో సిద్ధార్ధ్ రాయ్ ట్రెండ్ సెట్ చేస్తుందని భావించారు. అయితే ఈ మూవీకి కూడా చెప్పుకోదగ్గ రివ్యూలు రాలేదు.
చిన్న హీరో మూవీ కావడంతో ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో లేవని చెప్పాలి. ఓవరాల్ గా చూసుకుంటే ఫిబ్రవరి నెల టాలీవుడ్ కి ఏ విధంగా కూడా కలిసిరాలేదు. బ్లాక్ బస్టర్ అనిపించుకునే స్థాయిలో ఒక్క మూవీ కూడా భారీ కలెక్షన్స్ ని రాబట్టలేకపోయింది. మార్చి నెల వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్ సినిమాతో ప్రారంభం అవుతోంది. ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ హెవీగానే ఉన్నాయి. వరుసగా రెండు డిజాస్టర్స్ తర్వాత వరుణ్ తేజ్ నుంచి ఈ మూవీ వస్తోంది. మరి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది వేచి చూడాలి.