ఆ బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబో వ‌చ్చేది అప్పుడేనా?

'నాయ‌కుడు' త‌ర్వాత ఈ జోడీచేతులు క‌ల‌ప‌డానికి మ‌ళ్లీ ఇన్ని సంవ‌త్స‌రాలు ప‌ట్టింది.

Update: 2024-10-28 11:30 GMT

మూడు ద‌శాబ్ధాల త‌ర్వాత‌ విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్-మ‌ణిర‌త్నం కాంబినేష‌న లో 'థ‌గ్ లైప్' అనే మ‌రో చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. 'నాయ‌కుడు' త‌ర్వాత ఈ జోడీచేతులు క‌ల‌ప‌డానికి మ‌ళ్లీ ఇన్ని సంవ‌త్స‌రాలు ప‌ట్టింది. వీరికి తోడుగా మ్యూజిక్ లెజెండ్ రెహ‌మాన్ కూడా భాగ‌మ‌వ్వ‌డంతో మ‌రింత బ‌జ్ క్రియేట్ అవుతుంది. దీంతో అంచ‌నాలు భారీగా ఉన్నాయి. భారీ కాన్వాస్ పై చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

ఇప్ప‌టికే సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. రిలీజ్ విష‌యంలో ఇప్ప‌టికే స్ప‌ష్ట‌త ఉంది. వేస‌వి సంద‌ర్భంగా రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే తేదీ విష‌యంలో క్లారిటీ లేదు. తాజాగా రిలీజ్ తేదీపై క్లారిటీ వ‌స్తుంది. ఈ సినిమాని త‌మిళ సంవ‌త్స‌రాది సంద‌ర్భంగా వ‌చ్చే ఏడాది ఏప్రిల్ రెండో వారంలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం.

దీనిలో భాగంగా ఏప్రిల్ 10వ తేదిని ప‌రిశీలిస్తున్న‌ట్లు కోలీవుడ్ మీడియాలో వార్త‌లొస్తున్నాయి. అంటే క‌మ‌ల్ అభిమా నులు మ‌రో ఆరు నెల‌లు ఎదురు చూడాల్సిందే. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కోసం ఆరు నెల‌లు స‌మ‌యం కేటాయిం చ‌డం అన్న‌ది చాలా ఎక్కువ‌గానే క‌నిపిస్తుంది. సినిమా షూటింగ్ కూడా ఆరు నెల‌లు చేయ‌లేదు. ప్రాజెక్ట్ ప్రారంభిం చడం..సెట్స్ కి వెళ్ల‌డం...పూర్తి చేయ‌డం అంతా వాయు వేగంగానే జ‌రిగిపోయింది.

కానీ సీజీ వ‌ర్క్ కి ఎక్కువ స‌మ‌యం టెక్నిక‌ల్ సిబ్బంది కోర‌డంతో ఏకంగా స‌మ్మ‌ర్ వ‌ర‌కూ తోసేసిన‌ట్లు తెలుస్తోంది. వాస్త‌వానికి డిసెంబ‌ర్ లేదా? సంక్రాంతికి రిలీజ్ ఉంటుంద‌ని భావించారు. కానీ ఆ ఛాన్స్ తీసుకోలేదు. ఇప్ప‌టికే సంక్రాంతికి కొంత మంది స్టార్ హీరోలు రిలీజ్ తేదీల్ని లాక్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News