రాయన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

ఆయన 50వ సినిమా కావడంతో ప్రతిష్టాత్మకంగా రాయన్ చిత్రాన్ని తెరకెక్కించి ఉంటారని అందరూ భావిస్తున్నారు.

Update: 2024-07-26 05:35 GMT

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా చేస్తున్న 50వ సినిమా రాయన్. ఆయన స్వీయ దర్శకత్వంలోనే సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించింది. మాస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ట్రైలర్ మూవీపై కొంత ఆసక్తి క్రియేట్ చేసింది. అయితే ఇంతకు ముందు కూడా ధనుష్ ఇలాంటి మాస్ యాక్షన్ కథలను చేశారు. ఆయన 50వ సినిమా కావడంతో ప్రతిష్టాత్మకంగా రాయన్ చిత్రాన్ని తెరకెక్కించి ఉంటారని అందరూ భావిస్తున్నారు.

ఈ కారణంగానే సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా తమిళంలో అయితే ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉంది. తెలుగులో ధనుష్ కి సార్ సినిమాతో కొంత మార్కెట్ క్రియేట్ అయ్యింది. అది రాయన్ చిత్రానికి హెల్ప్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే రాయన్ సినిమాపై వరల్డ్ వైడ్ గా 45 కోట్ల మేరకు వ్యాపారం జరిగిందంట. ఆయన గత సినిమా కెప్టెన్ మిల్లర్ కూడా ఈ రేంజ్ లోనే 44 కోట్ల బిజినెస్ వరల్డ్ వైడ్ గా చేసింది.

దానికంటే కోటి ఎక్కువగానే రాయన్ మూవీపై వ్యాపారం జరగడం విశేషం. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ అందుకోవాలంటే 46 కోట్ల షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కల్లో 85 నుంచి 90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ అందుకుంటే రాయన్ మూవీ క్లీన్ హిట్ గా నిలుస్తుంది. తమిళనాడులో ఈ సినిమా 28 కోట్ల బిజినెస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఐదు కోట్లకి రాయన్ రైట్స్ అమ్ముడయ్యాయి. 5.50 కోట్ల షేర్ అందుకుంటే టాలీవుడ్ లో రాయన్ బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ తో హిట్ బొమ్మగా నిలుస్తుంది.

కర్ణాటకలో మూడు కోట్ల వరకు బిజినెస్ జరిగిందంట. ఓవర్సీస్ లో 7.50 కోట్ల వ్యాపారం రాయన్ పై జరగడం విశేషం. అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.50 కోట్ల మేరకు బిజినెస్ జరిగింది. ఓవరాల్ గా 46 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ అంటే పెద్ద కష్టమేమీ కాదని చెప్పొచ్చు. ఈ సినిమాకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన వారం పది రోజుల్లోనే ఈ కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ ఉంది.

కేవలం కోలీవుడ్ లోనే కాకుండా తెలుగు, హిందీ స్టేట్స్ లో కూడా ధనుష్ కి మంచి ఆదరణ ఉంది. ఇది రాయన్ సినిమాకి ప్లస్ అవుతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి ధనుష్ 50వ చిత్రంగా వస్తున్న రాయన్ మూవీ ఎలాంటి సక్సెస్ ని బాక్సాఫీస్ దగ్గర అందుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీని తర్వాత ధనుష్ తెలుగులో చేస్తున్న పాన్ ఇండియా మూవీ కుబేర థియేటర్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. వచ్చే ఏడాది ఆరంభంలో కుబేర మూవీ రిలీజ్ అవుతుందంట.

Tags:    

Similar News