ఇండియన్ ఇండస్ట్రీలలో ఫస్ట్ 500 కోట్లు కొట్టిన సినిమాలివే!

అయితే ఒకప్పుడు 500 కోట్ల మార్క్ అనేది చాలా ప్రత్యేకమైనదిగా భావించబడింది.

Update: 2025-01-11 15:30 GMT

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్‌లో భారీ సినిమాకు హిట్ టాక్ వస్తే 1500 కోట్లకు పైగానే కలెక్షన్లు అందుకుంటున్నాయి. రీసెంట్‌గా పుష్ప 2 1800 కోట్ల మార్క్‌ను టచ్ చేయడంతో ఈ ట్రెండ్ స్పష్టమైంది. అయితే ఒకప్పుడు 500 కోట్ల మార్క్ అనేది చాలా ప్రత్యేకమైనదిగా భావించబడింది. మొదటగా ఈ రికార్డును బాలీవుడ్‌లో ఆమిర్ ఖాన్ సాధించారు. ఇండియన్ ఇండస్ట్రీల వారిగా మొదటిసారి 500 కోట్లు అందుకున్న సినిమాలు ఈ విధంగా ఉన్నాయి.

బాలీవుడ్‌ నుంచి ధూమ్ 3

2013లో విడుదలైన ధూమ్ 3 బాలీవుడ్‌లోనే మొదటిసారి 500 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రం. అమీర్ ఖాన్ డిఫరెంట్ యాక్టింగ్ స్కిల్స్, అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు, వరల్డ్ రేంజ్ ఆడియెన్స్ కు తగిన గ్రాండ్ విజువల్స్ ఈ సినిమాను భారీ విజయంగా నిలిపాయి. ధూమ్ సిరీస్‌లో మూడో భాగంగా వచ్చిన ఈ సినిమా, భారతీయ ప్రేక్షకులతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ప్రభావం చూపించింది.

టాలీవుడ్‌ నుంచి బాహుబలి

బాహుబలి: ది బిగినింగ్ 2015లో భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త ట్రెండ్ ను ప్రారంభించింది. రాజమౌళి దర్శకత్వంలో, ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా నటనతో టాలీవుడ్‌ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లింది. అత్యున్నత సాంకేతికత, విలువలు కలిగిన కథనంతో ఈ సినిమా మొదటిసారిగా టాలీవుడ్‌ నుంచి 500 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సినిమా తరువాత వచ్చిన బాహుబలి 2 అయితే ఆ రికార్డులను మరింతగా అధిగమించింది.

కోలీవుడ్‌ నుంచి 2.0

2018లో రజనీకాంత్, అక్షయ్ కుమార్ ముఖ్య పాత్రల్లో నటించిన 2.0 కోలీవుడ్‌ నుంచి 500 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి చిత్రం. శంకర్ విజువల్ ఫీస్ట్, రజనీకాంత్ క్రేజ్, అద్భుతమైన VFX వర్క్ ఈ సినిమాను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాయి. భారతీయ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో ఇది ఓ బిగ్ మూవీగా నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ఈ చిత్రానికి విశేష ఆదరణ లభించింది.

సాండల్‌వుడ్‌ నుంచి KGF 2

2022లో విడుదలైన కేజీఎఫ్ చాప్టర్ 2 సాండల్‌వుడ్‌ నుండి 500 కోట్ల క్లబ్‌లో చేరిన మొదటి చిత్రం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ నటన, పవర్‌ఫుల్ స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు మాస్ అప్పీల్‌ను తీసుకువచ్చాయి. ఈ చిత్రం కేవలం భారతీయ మార్కెట్‌ను కాదు, అంతర్జాతీయ మార్కెట్‌ను కూడా కదిలించింది. సాండల్‌వుడ్‌లోనే కాదు, పాన్ ఇండియా స్థాయిలో ఒక పెద్ద విజయంగా నిలిచింది.

ఇవి చూసినప్పుడు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీల అభివృద్ధి, వారి మార్కెట్ విస్తరణ స్పష్టంగా కనిపిస్తోంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్, సాండల్‌వుడ్ వరకు భారతీయ సినిమాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. 500 కోట్ల క్లబ్ అప్పట్లో ప్రత్యేకమైన మైలురాయిగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం పాన్ ఇండియా హీరోలకు 1000 కోట్ల మార్క్ సాధించడం మినిమమ్ టార్గెట్ గా మారింది.

Tags:    

Similar News