విడాకులు తీసుకున్న మొదటి ఇండియన్‌ మహిళ ఈమెనే!

వయసుతో సంబంధం లేకుండా పదుల ఏళ్ల సంసార జీవితం తర్వాత విడాకులు తీసుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు.

Update: 2025-01-05 03:19 GMT

ఈ మధ్య కాలంలో ఇండియాలో విడాకుల కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఒక సర్వే ప్రకారం గత రెండు దశాబ్దాల్లో ఫ్యామిలీ కోర్టుల్లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 250 రెట్లు పెరిగింది. అంటే ఏ స్థాయిలో దేశంలో విడాకులు తీసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. సెలబ్రిటీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా విడాకుల వార్తల్లో నిలుస్తున్నారు. నెలకు ఒక్క జంట అయినా విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా పదుల ఏళ్ల సంసార జీవితం తర్వాత విడాకులు తీసుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. ఇంతకు ఇండియాలో మొదటి విడాకులు ఎప్పుడు తీసుకున్నారు? ఎవరు తీసుకున్నారో తెలుసా?

ఇండియాలో రుఖ్మాబాయి రౌత్‌ అనే మహిళ మొదటి సారి విడాకులు తీసుకుంది. అప్పట్లో బాల్య వివాహ పద్ధతి ఉండేది. 1864 లో జన్మించిన ఆమెకు 11 ఏళ్ల వయసులోనే 19 ఏళ్ల దాదాజీ భికాజీతో వివాహం చేశారు. ఆ వయసులో రుఖ్మాబాయి రౌత్‌ చదువుకోవాలని ఆశ పడింది. దాంతో తాను దాదాజీ నుంచి విడిపోవాలి అనుకుంది. అందుకోసం ఆమె వివాహ బంధం రద్దుకు సిద్ధం అయ్యింది. ఆ సమయంలో ఆమెను చాలా మంది విమర్శించారు. కానీ ఆమె మహిళా హక్కుల కోసం పోరాటం చేయడం కోసం తాను ముందుగా విడాకులు తీసుకుని చదువుకోవాలని నిర్ణయించుకుంది.

ఆమె విడాకుల విషయంలో అప్పట్లో బ్రిటీష్‌ క్వీన్‌ విక్టోరియా కల్పించుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ ద్వారా క్వీన్‌ విక్టోరియా మహారాణి ఆదేశాలతో విడాకులు మంజూరు అయ్యాయి. 1885లో రుఖ్మాబాయి రౌత్‌కి అధికారికంగా విడాకులు మంజూరు అయ్యాయి. విడాకుల తీసుకున్న తర్వాత ఆమె తాను అనుకున్న మార్గంలో నడిచింది. చదువుకోవడం మొదలు పెట్టింది. అంతే కాకుండా విదేశాల్లో ఆమె చదువు కోసం వెళ్లింది.

లండన్ వెళ్లి మరీ వైద్య విద్యను అభ్యసించారు. దాంతో భారతదేశంలో మొట్ట మొదటి మహిళ వైద్యురాలిగా రుఖ్మాబాయి రౌత్‌ నిలిచారు. దేశ వ్యాప్తంగా ఎంతో మందికి ఆమె ఆదర్శంగా నిలిచారు. బ్రిటిష్ కాలంలో ఆమె మహిళ విద్యకు పలు ఉద్యమాలు చేశారు. మహిళలు చదువుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 35 ఏళ్ల పాటు రాజ్‌ కోట్‌లోని ఆసుపత్రిలో చీఫ్ మెడికల్‌ ఆఫీసర్గా రుఖ్మాబాయి రౌత్ పని చేశారు. మహిళల హక్కుల కోసం పోరాటం చేయడంతో పాటు ఎన్నో అరుదైన ఘనతను అందుకున్నారు. పెళ్లి బంధం అనేది జీవితంలో ముందుకు సాగడంకు అడ్డుగా ఉంటే దాని నుంచి బయట పడి సొంత కాళ్లపై నిలవాలని ఎంతో మంది మహిళలకు రుఖ్మాబాయి ఆదర్శంగా నిలుస్తారు.

Tags:    

Similar News