పివి సింధు పెళ్లి ఫస్ట్ లుక్ ఇదే
ఈ జంట వివాహానికి సంబంధించిన మొదటి ఫోటో, మొదటి వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.
బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు టెక్ ఎగ్జిక్యూటివ్ వెంకట దత్త సాయిని ఈ ఆదివారం నాడు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట వివాహానికి సంబంధించిన మొదటి ఫోటో, మొదటి వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఇంతకుముందే కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆశీస్సులు అందిస్తూ దంపతుల ఆకర్షణీయమైన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ అయింది. వివాహానికి ముందు జరిగే ఉత్సవాల్లో సంగీత్, హల్దీ , మెహందీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు ఏవీ ఇంకా రివీల్ కాలేదు.
పివి సింధు వివాహ వేడుక నుండి వచ్చిన మొదటి విజువల్ ఇప్పుడు అభిమానులను విస్మయానికి గురి చేసింది. ఈ వీడియోలో నవవధూవరులు ఎంతో ఉత్సాహంగా నవ్వులు చిందిస్తూ కనిపించారు. రాజస్థాన్ ఉదయపూర్‌లోని అత్యంత ఖరీదైన వెన్యూలో ఈ జంట వివాహం హిందూ సాంప్రదాయ విధానంలో జరిగింది. అలాగే ఈ మంగళవారం నాడు జరిగే వివాహ విందుకు సినీరాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారని తెలుస్తోంది.
పివి సింధు పెళ్లి వార్త సడెన్ గా మీడియాలో వైరల్ అయింది. డిసెంబర్ 20న సంగీత్, హల్దీ, పెళ్లికూతురు , మెహందీ వేడుకలు జరిగాయి. చాలా కాలంగా పరిచయమున్న ఇరు కుటుంబాలు నెల రోజుల్లోనే పెళ్లి ప్లాన్‌ను ఖరారు చేసుకున్నాయని సింధు తండ్రి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మునుముందు సింధు శిక్షణ, బ్యాడ్మింటన్ కాంపిటీషన్స్ షెడ్యూళ్లకు అంతరాయం లేకుండా పెళ్లి తేదీని లాక్ చేసామని వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన పోసిడెక్స్ టెక్నాలజీస్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయి క్రీడా సంబంధ అభిరుచిని కలిగి ఉన్నారు. సింధు డిసెంబరు 24న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్‌ను నిర్వహించనున్నారని తెలుస్తోంది.