ఈ వారం 5 ఇండస్ట్రీల నుంచి 5 సినిమాలు.. విజేతగా నిలిచేదెవరు?
ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో మొత్తం చిన్న సినిమాలే రిలీజయ్యాయి. గత వారం రిలీజుల్లో ఒక్క పెద్ద హీరో సినిమా కూడా లేదు.;

సమ్మర్ మొదలైందంటే సినీ ఇండస్ట్రీకి పండగే. పిల్లలకు సెలవులుంటాయి కాబట్టి ఆడియన్స్ ఫ్యామిలీలతో సినిమాలకు వస్తారని భావిస్తూ తమ సినిమాలను రిలీజ్ చేస్తుంటారు దర్శకనిర్మాతలు. అయితే ప్రతీసారీ సమ్మర్ లో పెద్ద సినిమాలు ఎక్కువగా రిలీజవుతుంటాయి. ప్రతీ ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భారీ సినిమాలు పెద్ద మొత్తంలో రిలీజ్ అవడం లేదు.
ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో మొత్తం చిన్న సినిమాలే రిలీజయ్యాయి. గత వారం రిలీజుల్లో ఒక్క పెద్ద హీరో సినిమా కూడా లేదు. అయితే ఈ వారం ఆ లోటు తీరేలా పలు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. ఐదు భాషల నుంచి ఐదు సినిమాలు ఏప్రిల్ 10న క్లాష్ అవుతున్నాయి. మరి ఆ సినిమాలేంటి? వాటికి సంబంధించిన వివరాలేంటో తెలుసుకుందాం.
గుడ్ బ్యాడ్ అగ్లీ: అజిత్, త్రిష హీరోహీరోయిన్లుగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఆపదలో ఉన్న కొడుకుని సేవ్ చేయడానికి రిటైర్డ్ గ్యాంగ్‌స్టర్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనే పాయింట్ తో తెరకెక్కింది. యాక్షన్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో కూడా రిలీజవుతోంది.
జాట్: బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జాట్. రెజీనా, సయామీ ఖేర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తీర ప్రాంతంలో ఉంటూ అక్కడి ప్రజల్ని శాసించే విలన్ కు హీరో ఎలా బుద్ధి చెప్పాడనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కూడా తెలుగులో రిలీజ్ అవుతోంది.
జాక్: టిల్లూ స్వ్కేర్ బ్లాక్ బస్టర్ తర్వాత సిద్దూ జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా జాక్. ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమాలో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది.
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి: యాంకర్ ప్రదీప్ హీరోగా చేస్తున్న రెండో సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. దీపిక పిల్లి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు నితిన్- భరత్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 11న ఈ సినిమా రిలీజ్ కానుంది.
కౌసల్య తనయ రాఘవ: రాజేష్, శ్రావణి శెట్టి జంటగా స్వామి పట్నాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన కౌసల్య తనయ రాఘవ. ఏప్రిల్ 11న రిలీజ్ కానున్న ఈ సినిమా రాముడు, రావణుడు కాన్సెప్ట్ తో తెరకెక్కిందని సినిమాకు అదే మెయిన్ హైలైట్ గా నిలవనుందని యూనిట్ వర్గాలు ముందు నుంచి చెప్పుకొస్తున్నాయి.
వీటితో పాటూ మలయాళంలో మమ్ముట్టి హీరోగా డినో డెన్నిస్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ బజూక ఏప్రిల్ 10న రిలీజ్ కానుండగా, గురుప్రీత్- గిప్పీ గ్రేవాల్ లీడ్ రోల్స్ లో రూపొందిన అకాల్ సినిమా ఏప్రిల్ 10వ వ తేదీన పంజాబీ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. బాలీవుడ్ నుంచి మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన పూలే సినిమా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరి ఇన్ని సినిమాల్లో బాక్సాఫీస్ వద్ద ఏయే సినిమాలు గట్టెక్కుతాయో చూడాలి.