GA2 బ్యానర్ పై 'మిత్రమండలి.. నలుగురు ఫ్రెండ్స్ తో అలా!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ బ్యానర్స్ లో గీతా ఆర్ట్స్ కూడా ఒకటన్న విషయం తెలిసిందే.

Update: 2025-02-03 11:59 GMT

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ బ్యానర్స్ లో గీతా ఆర్ట్స్ కూడా ఒకటన్న విషయం తెలిసిందే. ఆ సంస్థ ద్వారా అల్లు అరవింద్.. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మంచి హిట్స్ అందుకుని ఆడియన్స్ ను అలరించారు. కొంతకాలం క్రితం అనుబంధ బ్యానర్ గీతా ఆర్ట్స్ 2 స్టార్ట్ చేశారు.

ఆ బ్యానర్ ను అల్లు అర్జున్ కు ఫ్రెండ్ గా అందరికీ సుపరిచితులైన బన్నీ వాస్ లీడ్ చేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది అంబాజీ మ్యారేజ్ బ్యాండ్, ఆయ్ చిత్రాలతో మంచి హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు తండేల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే ఆ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

యంగ్ హీరో నాగచైతన్య, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న తండేల్.. నిజ జీవిత ఘటన ఆధారంగా రూపొందుతోంది. చందూ మొండేటి తెరకెక్కిస్తుండగా.. ఇప్పటికే ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. భారీ స్థాయిలో ఫిబ్రవరి 7వ తేదీన మేకర్స్.. తెలుగు, తమిళం, హిందీలో రిలీజ్ చేయనున్నారు.

కచ్చితంగా తండేల్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంతా అంచనా వేస్తున్నారు. అయితే తండేల్ తర్వాత కొత్త సినిమాను పట్టా లెక్కించేందుకు బన్నీ వాస్ సిద్ధమవుతున్నట్లు ఇప్పుడు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంట్రెస్టింగ్ స్టోరీతో ఓ మూవీని రూపొందించేందుకు అంతా సెట్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

మిత్రమండలి టైటిల్ తో సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. నలుగురు స్నేహితుల కథతో మూవీ ఉండనుందని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. క్యాస్టింగ్ డిటేల్స్ అండ్ టైటిల్ తో అధికారిక ప్రకటన ఇవ్వనున్నారని వినికిడి.

అయితే నలుగురు స్నేహితుల కథ కాగా.. యంగ్ హీరో, కమెడియన్ ను ప్రియదర్శిని ఓ లీడ్ రోల్ కోసం సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. మిగిలిన ముగ్గురిని ఎంపిక చేసే పనిలో మూవీ టీమ్ ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఫిక్స్ చేయనున్నారని వినికిడి. డైరెక్టర్ సహా ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకు వస్తాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి చూడాలి ఎప్పుడు అన్ని డిటైల్స్ అనౌన్స్ చేస్తారో..

Tags:    

Similar News