గబ్బర్ సింగ్ రీ రిలీజ్.. యూఎస్ లో రచ్చ మొదలైంది

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన సినిమాలలో గబ్బర్ సింగ్ ఒకటి.

Update: 2024-08-28 11:43 GMT

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాలు ప్రతిసారి ఏదో ఒక రికార్డును బ్రేక్ చేస్తూనే ఉన్నాయి. వారి అభిమాన హీరోల సినిమాలను మరోసారి బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఫ్యాన్స్ అయితే ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక త్వరలోనే పవన్ కళ్యాణ్ నటించిన మరో సినిమా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన సినిమాలలో గబ్బర్ సింగ్ ఒకటి.

అప్పట్లో చాలా కాలం తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ అందుకున్న విజయం ఇది. దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇప్పటివరకు అతను అదే క్రేజ్ తో ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు అంటే సినిమా ఎంతగా సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక బండ్ల గణేష్ కు నిర్మాతగా ఒక మంచి గుర్తింపును తీసుకువచ్చింది.

దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలో మరొక హైలెట్. ఇక ఈ సినిమాని ఇప్పుడు రీ రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. గబ్బర్ సింగ్ 4K లో సెప్టెంబర్ 1వ తేదీన వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా గ్రాండ్ గా విడుదల అవుతూ ఉండడం విశేషం. యూఎస్ లో పవన్ కళ్యాణ్ కు క్రేజ్ కూడా గట్టిగానే ఉండడంతో అక్కడ కూడా సినిమాను ఎక్కువ స్క్రీన్స్ లలో విడుదల చేస్తున్నారు.

ఇక బుకింగ్స్ ఓపెన్ అయిన కొన్ని నిమిషాల్లోనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవ్వుతున్నాయి. 93 లొకేషన్స్ లలో 256 షోలకు గాను ఇప్పటికే $19.731 అందుకున్నట్లు సమాచారం. అంటే 1565 టిక్కెట్లు అమ్ముడయ్యాయాని తెలుస్తోంది. ఈ రేంజ్ లో సినిమాకు రెస్పాన్స్ వస్తుందని ఎవరు ఊహించలేదు. ఓవర్సీస్ లో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ అలాంటిది. చూస్తుంటే ఈ సినిమా ఆల్ టైమ్ బెస్ట్ ఓపెనింగ్స్ లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.

Tags:    

Similar News