గబ్బర్ సింగ్ 4K రీరిలీజ్.. బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉందంటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ గబ్బర్ సింగ్ అప్పట్లో ఎలాంటి ట్రెండ్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Update: 2024-09-01 06:13 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ గబ్బర్ సింగ్ అప్పట్లో ఎలాంటి ట్రెండ్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుస ఫ్లాప్ లు అందుకున్న పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ తో రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. 2012లో రిలీజ్ అయిన ఈ సినిమాతో శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. హరీష్ శంకర్ కి కమర్షియల్ డైరెక్టర్ గా మంచి ఇమేజ్ వచ్చింది. నిర్మాత బండ్ల గణేష్ ఈ చిత్రంతో స్టార్ ప్రొడ్యూసర్ గా మారిపోయారు. పవన్ కళ్యాణ్ కెరియర్ లో బెస్ట్ సినిమాలలో గబ్బర్ సింగ్ కూడా ఒకటని చెప్పొచ్చు.

పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా గబ్బర్ సింగ్ 4K వెర్షన్ ని సెప్టెంబర్ 2న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ యాక్టివిటీస్ కూడా బండ్ల గణేష్, హరీష్ శంకర్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ ఫస్ట్ బర్త్ డే వేడుకలు జరగబోతున్నాయి. అదే సమయంలో గబ్బర్ సింగ్ రీరిలీజ్ కావడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ సినిమాని చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన నుంచి వచ్చిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో సినిమాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేదు.

సాలిడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ ని పవర్ స్టార్ అభిమానులు చూడాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. వీరందరి కోరిక తీర్చేందుకు ఇప్పుడు గబ్బర్ సింగ్ రీరిలీజ్ గా థియేటర్స్ లోకి వస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే అదిరిపోయే కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. నైజాంలో 1.50 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కలెక్షన్స్ వచ్చాయంట. ఇక ఏపీ, సీడెడ్ కలిపి 1.1 కోట్ల మేరకు అడ్వాన్స్ బుకింగ్స్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.

కర్ణాటకలో 20 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 10 లక్షలు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కలెక్షన్ అయినట్లు సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే తెలుగు రాష్ట్రాలలో 2.60 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ జరిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కలెక్షన్స్ లెక్క 4 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రీరిలీజ్ అయిన ఏ సినిమాకి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ స్థాయి వసూళ్లు రాలేదంట.

పవన్ కళ్యాణ్ ఇమేజ్ కారణంగానే ఇది సాధ్యం అయ్యిందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. రీరిలీజ్ కి ముందు రోజు నైట్స్ కూడా ప్రీమియర్ షోలు పడుతున్నాయి. ఈ అడ్వాన్స్ బుకింగ్స్ తో పాటు ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కలుపుకుంటే గబ్బర్ సింగ్ కచ్చితంగా మొదటి రోజు 4 కోట్ల వరకు వసూళ్లని అందుకునే ఛాన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే కచ్చితంగా రికార్డ్ అని చెప్పొచ్చు. కలెక్షన్స్ పరంగా గబ్బర్ సింగ్ మూవీ రీరిలీజ్ లో ట్రెండ్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.

Tags:    

Similar News