'ఆర్‌ఆర్‌ఆర్‌' రేంజ్‌ లో గేమ్‌ ఛేంజర్‌ యాక్షన్‌..!

దిల్‌ రాజు ఆఫీస్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఒక యాక్షన్‌ సన్నివేశం కోసం ఏకంగా రూ.15 కోట్లను ఖర్చు చేశారట.

Update: 2024-09-10 08:30 GMT

రామ్‌ చరణ్ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'గేమ్‌ ఛేంజర్‌' సినిమా డిసెంబర్‌ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు విడుదల తేదీ విషయంలో నిర్మాత దిల్‌ రాజు కాంపౌండ్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఆ మధ్య ఇండియన్ 2 ఫలితం కారణంగా గేమ్‌ ఛేంజర్‌ పూర్తిగా చేంజ్ చేస్తున్నారని, ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. అదే నిజమైతే 2025 సమ్మర్ వరకు గేమ్‌ ఛేంజర్ కోసం వెయిట్‌ చేయక తప్పదనే టాక్ కూడా ఆ సమయంలో ప్రముఖంగా వినిపించింది.

తాజా సమాచారం ప్రకారం గేమ్‌ ఛేంజర్ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరిందట. ఈ సినిమాలోని ఒక యాక్షన్‌ సన్నివేశం గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. దర్శకుడు శంకర్‌ అంటేనే భారీతనంకు పెట్టింది పేరు. అలాంటి శంకర్ దర్శకత్వంలో గేమ్‌ ఛేంజర్‌ రూపొందుతూ ఉందంటే కచ్చితంగా అంతకు మించి అన్నట్లుగా సన్నివేశాలు ఉండటం ఖాయం. దిల్‌ రాజు ఆఫీస్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఒక యాక్షన్‌ సన్నివేశం కోసం ఏకంగా రూ.15 కోట్లను ఖర్చు చేశారట. నెల రోజుల పాటు వందల మంది జూనియర్‌ ఆర్టిస్టులతో ఆ సన్నివేశం షూట్‌ చేశారని తెలుస్తోంది.

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా లో చరణ్ ఎంట్రీ సన్నివేశంను వేలాది మందితో షూట్‌ చేసిన విషయం తెల్సిందే. ఆ సన్నివేశంలో చరణ్‌ ను చూసిన ప్రతి ఒక్కరికి సర్‌ప్రైజింగ్‌ గా అనిపించడం ఖాయం. కాస్త అటు ఇటుగా గేమ్‌ ఛేంజర్‌ లోనూ అదే స్థాయి యాక్షన్‌ సన్నివేశాలను ప్లాన్‌ చేస్తున్నారట. 500 మంది జూనియర్‌ ఆర్టిస్టులతో వంద మంది ఫైటర్స్ తో గేమ్‌ ఛేంజర్‌ సినిమా లోని ఆ యాక్షన్ సన్నివేశాన్ని దర్శకుడు శంకర్‌ నెల రోజుల పాటు చిత్రీకరించాడని, అందుకోసం ఏకంగా రూ.15 కోట్లు ఖర్చు అయినట్లుగా టాక్‌ వినిపిస్తోంది.

పొలిటికల్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌ గా కియారా అద్వానీ నటిస్తోంది. చరణ్ డబుల్‌ రోల్‌ లో కనిపించబోతున్న విషయం తెల్సిందే. తండ్రి పాత్రలో కనిపించబోతున్న చరణ్ కి అంజలి జోడీగా కనిపించనుంది. ప్రముఖ టాలీవుడ్‌ స్టార్స్ తో పాటు కోలీవుడ్‌ స్టార్స్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదల అయిన జరగండి పాటకు మంచి స్పందన వచ్చింది. త్వరలోనే మరో పాటను విడుదల చేయాలని భావిస్తున్నారు. శంకర్‌ గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో కొందరు ఈ సినిమాపై అనుమానం వ్యక్తం చేస్తున్నప్పటికీ, దిల్‌ రాజు నిర్మించిన సినిమా అవ్వడం వల్ల కచ్చితంగా బాగుంటుందనే విశ్వాసంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News