గేమ్ ఛేంజర్ US సంగతేంటి? పుష్ప-2 ఫార్ములా రిపీటా?
అందుకు తగ్గ ఏర్పాట్లను పూర్తి చేసే పనిలో ఉన్న మేకర్స్.. ఇప్పుడు జోరుగా ప్రమోషన్స్ ను చేపడుతున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబోలో గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ కు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన విడుదల అవ్వనుంది. అందుకు తగ్గ ఏర్పాట్లను పూర్తి చేసే పనిలో ఉన్న మేకర్స్.. ఇప్పుడు జోరుగా ప్రమోషన్స్ ను చేపడుతున్నారు.
అందులో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమెరికాలో ప్లాన్ చేసిన సంగతి విదితమే. శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి డల్లాస్ లో వేడుక జరగనుండగా.. జీనియస్ డైరెక్టర్ సుకుమార్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ కానున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి భారీ కార్ల ర్యాలీతో రామ్ చరణ్.. కార్యక్రమం జరిగే వేదిక వద్దకు చేరుకోనున్నారట.
అయితే ఇప్పటికే అమెరికాలో గేమ్ ఛేంజర్ ప్రీ బుకింగ్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత సేల్స్ పెరుగుతాయని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ప్రీ సేల్స్ నెంబర్ 100kకి పైగా ఉండగా.. ఈవెంట్ సమయానికి మిలియన్ మార్క్ టచ్ చేయవచ్చని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. బడా సినిమాకు ఇది పెద్ద కష్టం కాకపోవచ్చు.
కానీ శంకర్ గత మూవీ ఫ్లాప్ అవ్వడం, మూడేళ్లు షూటింగ్ జరుపుకోవడం వంటి కారణాల వల్ల గేమ్ ఛేంజర్.. అమెరికా ప్రీ సేల్స్ ఎలా ఉంటాయోనని అంతా మాట్లాడుకుంటున్నారు. డల్లాస్ ఈవెంట్ టైమ్ కు మిలియన్ మార్క్ టచ్ చేస్తే.. ప్రమోషన్స్ ను మరింత హుషారుగా నిర్వహించడానికి ఊపు వస్తుందని అంటున్నారు.
అయితే గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ను దిల్ రాజు వేరే లెవెల్ లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో మూవీని భారీగా ప్రమోట్ చేయాలని డిసైడ్ అయ్యారట. నార్త్ లో పెద్ద ఈవెంట్స్ ను నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. దేశంలోని ఐదు నగరాలు కవర్ చేయాలనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.
మొత్తం ప్రమోషన్స్ కు గాను రూ.15 కోట్లు ఖర్చు పెట్టనున్నారని వినికిడి. ఆడియన్స్ మొత్తం దృష్టిని సినిమా వైపు తిప్పుకోవాలని యోచిస్తున్నారట. పుష్ప-2కు మైత్రీ మూవీ మేకర్స్ చేపట్టిన ప్రమోషన్స్ చాలా హెల్ప్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు దిల్ రాజు కూడా ప్రమోషన్స్ తో భారీ హైప్ క్రియేట్ చేయాలని ఫిక్స్ అయ్యి ముందుకు వెళ్తున్నారని తెలుస్తోంది. ప్రమోషన్స్ విషయంలో పుష్ప-2 ఫార్ములా ఫాలో అవుతున్నారట!