గేమ్ ఛేంజర్.. బీటౌన్ వెయిటింగ్ కు కారణమేంటో?
వాటితో పాటు బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్ ఎలా ఉంటుందో.. మేకర్స్ ఎలా కట్ చేశారో.. ఎలాంటి బజ్ క్రియేట్ అవుతుందోనని ఎదురుచూస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్.. మరో ఎనిమిది రోజుల్లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా.. తెలుగమ్మాయి అంజలి మరో ఫిమేల్ లీడ్ రోల్ లో కనిపించనున్నారు.
శ్రీకాంత్, ఎస్ జే సూర్య సహా పలువురు కీలక పాత్రలు పోషించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గ్రాండ్ గా నిర్మించారు. రూ.350 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందించినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నందున.. మేకర్స్ ఇప్పుడు ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.
ఇప్పటికే సినిమా నుంచి మేకర్స్ టీజర్ తో పాటు జరగండి, రా మచ్చా మచ్చా, హైరానా, డోప్ సాంగ్స్ రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. త్వరలో మరో రెండు సాంగ్స్ విడుదల చేయనున్నారు. ఇప్పుడు మరికొద్ది నిమిషాల్లో ట్రైలర్ ను మేకర్స్ రివీల్ చేయనుండగా.. మెగా అభిమానులు, సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు.
వాటితో పాటు బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్ ఎలా ఉంటుందో.. మేకర్స్ ఎలా కట్ చేశారో.. ఎలాంటి బజ్ క్రియేట్ అవుతుందోనని ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే థియేట్రికల్ ట్రైలర్.. ఎఫెక్ట్ ఆడియన్స్ పై కచ్చితంగా ఉంటుంది. వేరే లెవెల్ బజ్ ను క్రియేట్ అయ్యేందుకు తోడ్పడుతుంది.
దాంతో పాటు హిందీ డిస్ట్రిబ్యూటర్లు.. సినిమాపై భారీగా పెట్టుబడి పెట్టారు. దీంతో ట్రైలర్ బలమైన ప్రభావం చూపించాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో రీసెంట్ గా పుష్ప 2: ది రూల్.. నార్త్ లో ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. కనీవినీ ఎరుగని రీతిలో దూసుకుపోతూ సంచలనం సృష్టిస్తోంది.
ఎన్నో రికార్డులు.. మరెన్నో ఘనతలు సాధించింది. దీంతో ఇప్పుడు గేమ్ ఛేంజర్ బీటౌన్ లో ఎలాంటి హిట్ అవుతుందోనని అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. అదే సమయంలో మేకర్స్ కూడా నార్త్ లో ప్రమోషనల్ కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు. త్వరలో ముంబైలో సందడి చేయనున్నారు. మరి గేమ్ ఛేంజర్ మూవీ.. బీటౌన్ లో ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.