గేమ్ చేంజర్.. ఎటు చూసినా సవాళ్లే..

అయితే ఫెస్టివల్ టైం లో అయితే కొంత కలిసొస్తుందని సంక్రాంతికి షిఫ్ట్ చేశారు.

Update: 2024-11-20 09:30 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి సంక్రాంతికి రాబోతున్న చిత్రం 'గేమ్ చేంజర్'. శంకర్ దర్శకత్వంలో సిద్ధమవుతోన్న ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన సంగతి తెలిసిందే. మూడేళ్ళ పాటు షూటింగ్ లో ఉన్న ఈ మూవీ ఎట్టకేలకి విడుదలకి సిద్ధమవుతోంది. డిసెంబర్ 20న ఈ సినిమాని రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే ఫెస్టివల్ టైం లో అయితే కొంత కలిసొస్తుందని సంక్రాంతికి షిఫ్ట్ చేశారు. ఇక చరణ్ కోసమే సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన మెగాస్టార్ 'విశ్వంభర' సినిమాని మే నెలకి వాయిదా వేశారు.

'గేమ్ చేంజర్' పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోన్న సినిమా కాబట్టి సంక్రాంతి సీజన్ కచ్చితంగా ప్లస్ అవుతుందని అందరూ అనుకున్నారు. మూవీపై ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ బజ్ లేదు. అయితే ఎలా అయిన మూవీని స్ట్రాంగ్ గా మార్కెట్ లోకి పంపించాలని దిల్ రాజు ప్రయత్నం చేస్తున్నారు. టీజర్ కి పర్వాలేదనే టాక్ వచ్చిన దేశ వ్యాప్తంగా సౌండ్ చేసేంత హైప్ రాలేదు. దిల్ రాజు సంక్రాంతి సీజన్ మీదనే పూర్తిగా హాప్ పెట్టుకున్నారు.

కంటెంట్ మీద నమ్మకం ఉన్న ఆ టైంలో అయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే 'గేమ్ చేంజర్' కి పోటీగా సంక్రాంతికి బాలయ్య 'డాకు మహారాజ్' మూవీ వస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అలాగే అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబోలో సిద్ధమవుతోన్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ కూడా రిలీజ్ కాబోతోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. అలాగే ‘డాకు మహారాజ్’ నైజాం రైట్స్ దిల్ రాజు సొంతం చేసుకున్నారు.

దీంతో తెలుగు రాష్ట్రాలలో థియేటర్ల పరంగా ‘గేమ్ చేంజర్’ మూవీకి పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. అయితే తమిళనాట మాత్రం గట్టి పోటీ ఎదురుకాబోతోందని టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం అజిత్ హీరోగా తెరకెక్కుతోన్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో మైత్రీ మూవీ మేకర్స్ ఉన్నారు. తమిళనాట అజిత్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే అక్కడి ప్రేక్షకులు కూడా మొదటి ప్రాధాన్యత తమిళ్ చిత్రానికే ఇస్తారు.

దీంతో తమిళనాడులో ‘గేమ్ చేంజర్’ కి గట్టి పోటీ ఎదురుకావడం గ్యారెంటీ అనుకుంటున్నారు. హిందీ బెల్ట్ లో ప్రస్తుతానికి ఈ సినిమాకి చెప్పుకోదగ్గ కాంపిటేషన్ లేదు. అయితే రామ్ చరణ్ మానియా ఎంత వరకు నార్త్ ఇండియాలో పనిచేస్తుందనే దానిని బట్టి మూవీ కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయి. శంకర్ కి కొంత క్రేజ్ ఉన్న గత కొన్నేళ్లుగా అతని నుంచి వచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్ అయ్యాయి. దీంతో అతనిపై పబ్లిక్ అటెన్షన్ తగ్గింది. మరి ఈ ఆటంకాలు ‘గేమ్ చేంజర్’ ఎంత వరకు అధికమిస్తుందనేది చూడాలి.

Tags:    

Similar News