టాప్ 10 లిస్ట్.. గేమ్ చేంజర్ థియేటర్ కౌంట్ ఎంత?

ప్రపంచవ్యాప్తంగా 6600 పైగా థియేటర్లలో ఈ చిత్రం విడుదలవుతుండటంతో టాలీవుడ్ తరఫున హైయెస్ట్ థియేటర్ కౌంట్ సాధించిన చిత్రాల జాబితాలో స్థానం సంపాదించింది.

Update: 2025-01-09 12:40 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన భారీ పాన్ ఇండియా చిత్రం 'గేమ్ చేంజర్' సంక్రాంతి బరిలో సందడి చేయబోతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా టీజర్, ట్రైలర్ విడుదల తర్వాత ప్రేక్షకులలో మరింత ఉత్సాహాన్ని నింపింది. ప్రపంచవ్యాప్తంగా 6600 పైగా థియేటర్లలో ఈ చిత్రం విడుదలవుతుండటంతో టాలీవుడ్ తరఫున హైయెస్ట్ థియేటర్ కౌంట్ సాధించిన చిత్రాల జాబితాలో స్థానం సంపాదించింది.

ఈ రేంజ్‌ రీచ్ కావడం సినిమాపై ప్రేక్షకుల అంచనాలను మరింత పెంచింది. గత ఏడాది పుష్ప 2 పది వేల థియేటర్స్ లో విడుదలై టాప్ లో కొనసాగుతోంది. ఇక 'గేమ్ చేంజర్' కూడా సంక్రాంతి రేసులో మరింత ఆకర్షణీయంగా నిలుస్తోంది. నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శంకర్ దర్శకత్వ ప్రతిభతో సినిమా విజువల్ ట్రీట్‌గా మారబోతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

'గేమ్ చేంజర్' థియేటర్ల కౌంట్ విషయంలో కొత్త రికార్డులు నమోదు చేయనుంది. టాలీవుడ్‌లో ఇప్పటికే పుష్ప-2, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు ఈ లెక్కల్లో సత్తా చూపాయి. వాటితో పోలిస్తే 'గేమ్ చేంజర్' థియేటర్ కౌంట్ హిందీలో కాస్త తక్కువే. ఇక చరణ్ సినిమా మరోసారి పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకునే ప్రయత్నంలో ఉంది. హైయెస్ట్ థియేటర్ కౌంట్ సాధించడం పక్కా విజయం వైపు తీసుకెళ్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ఇప్పటివరకు టాలీవుడ్ నుండి హైయెస్ట్ థియేటర్ కౌంట్ సాధించిన సినిమాలలో ప్రభాస్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. బాహుబలి నుంచి ప్రభాస్ సినిమాలు 6 వేలకు తక్కువ ఉండడం లేదు. ఇక పుష్ప 2తో బన్నీ RRR రికార్డులను బ్రేక్ చేసి టాప్ లో కొనసాగుతున్నాడు. దేవర 6వ స్థానంలో ఉండగా గేమ్ చేంజర్ ఆ లిస్టులో 9వ స్థానంలో నిలవడం గమనార్హం.

టాలీవుడ్ హైయెస్ట్ థియేటర్ కౌంట్ మూవీస్

1. పుష్ప 2 – 10,410+

2. ఆర్ఆర్ఆర్ – 10,200+

3. బాహుబలి 2 – 8500-9000

4. కల్కి 2898 ఎడి – 8400-8500

5. సాహో – 7978

6. దేవర పార్ట్ 1 – 7100-7250

7. రాధే శ్యామ్ – 7010+

8. ఆదిపురుష్ – 7000+

9. గేమ్ చేంజర్ – 6550+

10. సలార్ పార్ట్ 1 – 6200+

Tags:    

Similar News