'గేమ్ చేంజర్' అసలు ఆయుధం సిద్ధం.. గెట్ రెడి!

మెగా ఫ్యామిలీ నుంచి సంక్రాంతి రేసులో వస్తోన్న సినిమా కాబట్టి తెలుగు రాష్ట్రాలలో ‘గేమ్ చేంజర్’ కి సాలిడ్ ఓపెనింగ్స్ గ్యారెంటీగా ఉంటాయి.

Update: 2024-12-25 11:57 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’ రిలీజ్ పండుగకు సమయం దగ్గర పడుతోంది. దిల్ రాజు అండ్ కో ఈ మూవీ ప్రమోషన్స్ పై గట్టిగా ఫోకస్ పెట్టారు. ఈ సినిమా నాలుగు భాషలలో రిలీజ్ అవుతోన్న నేపథ్యంలో ఇండియాలో నాలుగు ప్రధాన పట్టణాలలో మెగా ఈవెంట్స్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి ఇప్పటికే ప్లానింగ్ రెడీ అయ్యిందంట.

హిందీలో కూడా ఈ సినిమాపై వీలైనంత స్ట్రాంగ్ గా హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ‘పుష్ప 2’ తరహాలోనే సాలిడ్ కలెక్షన్స్ పై గేమ్ దిల్ రాజు గురిపెట్టారు. అయితే ఇప్పటివరకు సినిమా పై అంచనాలు కాస్త మిక్స్ డ్ గానే ఉన్నాయి. సాంగ్స్ అనుకున్నంత స్థాయిలో అన్ని భాషల్లో క్లిక్కవ్వలేదు. కాబట్టి ప్రమోషన్ కంటెంట్ స్ట్రాంగ్ గా ఉండాల్సిందే.

ఇక అందరి ఫోకస్ ఎక్కువగా ట్రైలర్ ఫైనే ఉంది. ఈ రోజుల్లో సినిమా ఓపెనింగ్స్ కు ట్రైలర్ అనేది అసలు ఆయుధం. ఒక్క ట్రైలర్ క్లిక్కయితే మొదటివారం బాక్సాఫీస్ వద్ద ఆ ప్రభావం ఉంటుంది. అందుకే మేకర్స్ ఆ విషయంలో స్ట్రాంగ్ కంటెంట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డిసెంబర్ 30న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ జరగబోతోందని తెలుస్తోంది. హైదరాబాద్ లో గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించి అందులో ట్రైలర్ విడుదల చేయబోతున్నారంట.

ఈ ట్రైలర్ రిలీజ్ అయితే మూవీ కాన్సెప్ట్ మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. దీని తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్ వేగం పెరగొచ్చని అనుకుంటున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి సంక్రాంతి రేసులో వస్తోన్న సినిమా కాబట్టి తెలుగు రాష్ట్రాలలో ‘గేమ్ చేంజర్’ కి సాలిడ్ ఓపెనింగ్స్ గ్యారెంటీగా ఉంటాయి. అయితే నార్త్ ఇండియాలో ఈ మూవీ ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తుందనే దానిని బట్టి ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ ఆధారపడి ఉంటుంది.

‘దేవర’ మూవీ మొదటి రోజు 100 కోట్లకు పైనే కలెక్ట్ చేసింది. అలాగే ‘గేమ్ చేంజర్’ కూడా ఫస్ట్ డే సాలిడ్ కలెక్షన్స్ రాబట్టాలంటే మాత్రం ట్రైలర్ తో మూవీ పైన హై లెవల్ బజ్ క్రియేట్ కావాల్సి ఉంటుంది. సాంగ్స్ తో కొంత వరకు బజ్ క్రియేట్ చేసిన కూడా సినిమాకి భారీ ఓపెనింగ్స్ తీసుకొచ్చే స్థాయిలో లేదు. దీంతో మెగా ఫ్యాన్స్ కూడా ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ మీదనే నమ్మకం పెట్టుకున్నారు.

అయితే ‘ఆర్ఆర్ఆర్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తోన్న పాన్ ఇండియా మూవీ కాబట్టి కచ్చితంగా క్రేజ్ ఉంటుందని భావిస్తున్నారు. సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెరగాలంటే కంటెంట్ కూడా కీలక భూమిక పోషిస్తుందని చెప్పాలి. ‘పుష్ప 2’ సాలిడ్ కలెక్షన్స్ సొంతం చేసుకోవడానికి పబ్లిసిటీతో పాటు సాంగ్స్, ట్రైలర్ కూడా ఒక రీజన్ అని చెప్పాలి. మరి ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ ఏ మేరకు హైప్ క్రియేట్ చేస్తుందనేది వేచి చూడాలి. ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తూ ఉండగా కియారా అద్వానీ, అంజలీ హీరోయిన్స్ గా నటించారు. శంకర్ దర్శకత్వంలో వస్తోన్న ఫస్ట్ తెలుగు సినిమా కావడంతో ఈ చిత్రం ఎంత వరకు ప్రేక్షకులని ఎట్రాక్ట్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News