గేమ్ ఛేంజర్: నానా హైరానా పాట కోసం
ఈ సినిమా ప్రచారంలో శంకర్ టీమ్ దూకుడుగా ఉంది. ఇటీవల థమన్ సంగీతం అందించిన నానా హైరానా పాటను మేకర్స్ విడుదల చేసారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్‌లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. రాజకీయాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో స్వార్థపరులు, అవినీతిపరులను ఎదురించే యువకుడి కథతో ఈ సినిమా రూపొందిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో కియరా అద్వాణీ కథానాయికగా నటించగా, పలువురు తెలుగు, తమిళ స్టార్లు కీలక పాత్రలు పోషిచారు.
ఈ సినిమా ప్రచారంలో శంకర్ టీమ్ దూకుడుగా ఉంది. ఇటీవల థమన్ సంగీతం అందించిన నానా హైరానా పాటను మేకర్స్ విడుదల చేసారు. జాతీయ అవార్డ్ గ్రహీత శ్రేయా ఘోషల్ - కార్తీక్ ఈ పాటను పాడారు. బాణికి అద్భుతమై స్పందన వచ్చింది. లిరికల్ వీడియో ఆద్యంతం అద్భుతమైన విజువల్స్ యువతరాన్ని ఆకర్షించాయి.
తాజాగా ఈ పాట చిత్రీకరణకు సంబంధించిన తెరవెనక ఫోటోలు వీడియోలను చిత్రబృందం విడుదల చేసింది. చిత్ర కథానాయకుడు రామ్ చరణ్ తన ఇన్ స్టాలో వీటిని షేర్ చేయడంతో మెగాభిమానుల్లో వైరల్ గా మారాయి. బాస్కో మార్టిస్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. చరణ్- కియరా జంట రొమాన్స్ తో పాటు., ఈ పాటలో విదేశీ డ్యాన్సర్లు తమ ప్రదర్శనతో ఆకట్టుకోనున్నారు. పాట కోసం ఎంపిక చేసుకున్న లొకేషన్లు, కాస్ట్యూమ్స్, స్టైలింగ్ ఇలా ప్రతిదీ యూనిక్ నెస్ తో ఆకర్షిస్తున్నాయి. విదేశీ ముద్దుగుమ్మల నడుమ చరణ్- కియరా- శంకర్- బాస్కో తదితరులు ఉన్న అందమైన ఫోటోగ్రాఫ్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.
ఈ చిత్రంలో శ్రీకాంత్, ఎస్జే సూర్య, అంజలి, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. సంక్రాంతి బరిలో `డాకు మహారాజ్`, `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాలతో `గేమ్ ఛేంజర్` పోటీపడనుంది.