గేమ్ చేంజర్… ఆ రెండు ట్విస్టులే అసలు హైలైట్
ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియా సర్కిల్ లో వినిపిస్తోంది. ఈ మూవీలో రెండు ప్రధానమైన ట్విస్ట్ లు ఉంటాయంట.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గేమ్ చేంజర్' మూవీ జనవరి 10న థియేటర్స్ లోకి రాబోతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సిద్ధమైన ఈ సినిమా పైన నిర్మాత దిల్ రాజు చాలా నమ్మకంతో ఉన్నారు. ఈ మూవీతో తిరిగి తాను సూపర్ ఫామ్ లోకి వస్తానని భావిస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ కూడా ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిందని చెప్పాలి.
శంకర్ ఒకప్పటి 'జెంటిల్మెన్', 'ఒకే ఒక్కడు' సినిమాల తరహాలో సోషల్ పొలిటికల్ డ్రామాగా ఈ మూవీ కథని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించినట్లు ఉందని తెలుస్తోంది. శంకర్ మార్క్ ఎలివేషన ప్రెజెంటేషన్ ట్రైలర్ లో కనిపించింది. ఈ నేపథ్యంలోనే మెగా అభిమానులు కూడా ఈ సినిమాపై హోప్స్ పెట్టుకున్నారు. కచ్చితంగా రామ్ చరణ్ ఈ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుంటాడని అనుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియా సర్కిల్ లో వినిపిస్తోంది. ఈ మూవీలో రెండు ప్రధానమైన ట్విస్ట్ లు ఉంటాయంట. అందులో ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఒక యాక్షన్ బ్లాక్ నుంచి వచ్చే ట్విస్ట్ సెకండ్ హాఫ్ పై ఎక్స్ పెక్టేషన్స్ పెంచానుందని టాక్. అలాగే సెకెండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ లో అప్పన్న క్యారెక్టర్ పొలిటికల్ ట్విస్ట్ కూడా సినిమాకి మంచి హైప్ ఇస్తుందనే మాట గట్టిగా వినిపిస్తోంది.
ఈ రెండు ఎలిమెంట్స్ సినిమాలో ప్రేక్షకులని అద్భుతంగా ఎట్రాక్ట్ చేసి సినిమాపై పాజిటివి ఫీల్ కలిగిస్తాయని అనుకుంటున్నారు. అలాగే ఈ సినిమాలోని జరగండి సాంగ్ గురించి ప్రత్యేక చర్చ నడుస్తోంది. ఇందులో శంకర్ పిక్చరైజేషన్ చాలా అద్భుతంగా ఉండబోతోందని టాక్ నడుస్తోంది. అలాగే సాంగ్స్ అన్ని కూడా చాలా కొత్తగా ఉంటాయని మాట్లాడుకుంటున్నారు. సాంగ్స్ కోసమే 75 కోట్ల వరకు ఖర్చు చేశారట.
ఇక రామ్ చరణ్, అంజలి అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ తో మరింత ఎట్రాక్ట్ చేస్తారని టాక్. అలాగే అంజలి పాత్రకి సంబంధించి అదిరిపోయే ట్విస్ట్ కూడా ఉంటుందని ఇప్పటికే శంకర్ కూడా చెప్పారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా కూడా మూవీని నెక్స్ట్ లెవల్ కి తీసుకొని వెళ్తుందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఓవరాల్ గా ఈ చిత్రం రామ్ చరణ్ కెరియర్ లో బెస్ట్ మూవీ అవుతుందని ఫ్యాన్స్ కూడా బలంగా నమ్ముతున్నారు. మూవీలోలో రామ్ చరణ్ కి జోడీగా కియారా అద్వానీ నటించింది. అలాగే ఎస్ జె సూర్య చిత్రంలో ప్రతినాయకుడిగా నటించారు. చరణ్, ఎస్ జె సూర్య మధ్య ఫైట్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని మాట్లాడుకుంటున్నారు. మరి ఫైనల్ అవుట్ ఫుట్ ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.