గేమ్ ఛేంజర్ తమిళ ప్రమోషన్స్.. దిల్ రాజు ఏమన్నారంటే..

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది.

Update: 2024-11-05 17:42 GMT

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్.. ఇప్పుడు గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఆ చిత్రంలో బాలీవుడ్ కియారా అడ్వానీ, తెలుగమ్మాయి అంజలి ఫిమేల్ లీడ్ రోల్స్ లో యాక్ట్ చేస్తున్నారు.

సీనియర్ యాక్టర్ శ్రీకాంత్, కోలీవుడ్ నటుడు ఎస్ జే సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ చివరి దశలో ఉండగా.. 2025 జనవరి 10వ తేదీన సినిమాను రిలీజ్ చేయనున్నారు. అయితే మంగళవారం సాయంత్రం చెన్నైలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు దిల్ రాజు. నిర్మాత ఆదిత్య రామ్‌ తో కలిసి పలు విషయాలను పంచుకున్నారు.

"నా 21 ఏళ్ల ప్రొడక్షన్ హౌస్ జర్నీలో గేమ్ ఛేంజర్ నా 50వ సినిమా. మూడేళ్ల క్రితం శంకర్ సార్ నాకు మూవీ కాన్సెప్ట్ చెప్పారు. ఇప్పుడు సినిమా కంప్లీట్ అవుతుంది. ఆదిత్య రామ్ నా ఫ్రెండ్. ఆయన నాలుగు తెలుగు సినిమాలను నిర్మించారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ తో చెన్నైలో బిజీ అయ్యారు. కొద్దిరోజుల క్రితం తమిళంలో గేమ్ ఛేంజర్ మూవీ చేద్దామని నేను చెప్పాను. ఆయన ఆసక్తితో ఓకే చెప్పారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌, ఆదిత్య రామ్‌ మూవీస్‌ సంస్థలు గేమ్ ఛేంజరే కాదు.. అనేక తమిళ సినిమాలు నిర్మిస్తాయి" అని దిల్ రాజు తెలిపారు.

"వారిసు తర్వాత కొన్ని తమిళ సినిమాలను నేను చేయాలనుకున్నాను. ఇప్పుడు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌, ఆదిత్య రామ్‌ మూవీస్‌ సంస్థలు కలిసి చేస్తాయి. పాన్ ఇండియా సినిమాలను రూపొందిస్తాయి. గేమ్ ఛేంజర్ విషయానికొస్తే.. 9వ తేదీన లక్నోలో టీజర్ ను లాంఛ్ చేస్తున్నాం. తర్వాత యూఎస్‌ డల్లాస్ లో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం. చెన్నైలో ఓ ఈవెంట్ ను నిర్వహిస్తాం. జనవరి తొలి వారంలో ఏపీ, తెలంగాణలో ఈవెంట్లు చేస్తాం. సినిమా పట్ల చాలా ఆసక్తిగా ఉన్నా. అన్ని చోట్లా చిత్రం బాగా ఆడుతుంది. సామాజిక అంశం కూడా సినిమాలో ఉంది" అని దిల్ రాజు చెప్పారు.

ఆ తర్వాత నిర్మాత ఆదిత్య రామ్ మాట్లాడారు. "చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చాను. పదేళ్లు అయిపోయిందనుకుంటా. ఎలాంటి మీడియాకు గానీ యూట్యూబ్ కు గానీ ఇంటర్వ్యూ నేనెప్పుడూ ఒప్పుకోలేదు. ఆదిత్యరామ్ మూవీస్ బ్యానర్ పై నాలుగు సినిమాలు చేశాను. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ లోకి వెళ్లిపోయాను. ఇప్పుడు దిల్ రాజు గారి ద్వారా మీడియాతో ముందుకు వచ్చాను. గేమ్ ఛేంజర్ తో రీ ఎంట్రీ ఇస్తున్నా. దిల్ రాజు గారితో తమిళ సినిమాలు చేస్తా. సరైన స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. తెలుగులో అత్యధిక హిట్స్ అందుకున్న ఆయనను తమిళ ఇండస్ట్రీలోకి ఇన్వైట్ చేస్తున్నాను" అని ఆదిత్య రామ్ చెప్పారు. మరి తమిళంలో గేమ్ ఛేంజర్ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

Full View
Tags:    

Similar News