గేమ్ చేంజర్‌పై 50 కోట్ల గందరగోళం

హై రేంజ్ కాంబినేషన్‌లో ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా రూపొందుతోన్న ‘గేమ్ చేంజర్’ సినిమాకు సంబంధించిన బిజినెస్ కూడా ఇప్పటికే చాలా వరకూ క్లోజ్ అయింది.

Update: 2024-10-18 22:30 GMT

టాలీవుడ్‌లోని హీరోలు మొత్తం పాన్ ఇండియా రేంజ్‌లో ప్రభావాన్ని చూపించే దిశగా అడుగులు వేస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే ఇప్పటికే నేషనల్ వైడ్ క్రేజ్‌ను, మార్కెట్‌ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. RRR సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయిన అతడు.. ఇప్పుడు అదే ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాడు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ‘గేమ్ చేంజర్’ అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. లెజెండరీ డైరెక్టర్ ఎస్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయిపోయింది. దీన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. ఇటీవలే సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చింది.

హై రేంజ్ కాంబినేషన్‌లో ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా రూపొందుతోన్న ‘గేమ్ చేంజర్’ సినిమాకు సంబంధించిన బిజినెస్ కూడా ఇప్పటికే చాలా వరకూ క్లోజ్ అయింది. ముఖ్యంగా ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ సొంతం చేసుకుంది. అప్పుడు ఈ మూవీ రైట్స్‌కు వంద కోట్ల రూపాయలకు పైగానే డీల్ జరిగినట్లు వార్తలు కూడా వచ్చాయి.

‘గేమ్ చేంజర్’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ డీల్ ఎప్పుడో కంప్లీట్ అయినా.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం దీనికి రూ. 50 కోట్లు డీల్ మాత్రమే జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది నిజామా కాదా అని కూడా తెలియకుండానే దీన్ని నెగెటివ్‌గానే చాలా మంది షేర్ చేస్తున్నారు. దీంతో అసలు విషయం తెలియని చాలా మంది నిజంగానే ఇంత తక్కువ బిజినెస్ జరిగిందా అని అనుకుంటున్నారు.

వాస్తవానికి ‘గేమ్ చేంజర్’ మూవీకి సంబంధించి తెలుగు, తమిళ వెర్షన్ల స్ట్రీమింగ్‌కు మాత్రమే అమెజాన్ ప్రైమ్ వంద కోట్లకు పైగా బిజినెస్ చేసుకుందట. మిగిలిన భాషలతో కలిసి మరో రూ. 50 కోట్లు కూడా పలికే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కావాలనే కొందరు నెగెటివ్‌గా ప్రచారం చేయడం చర్చనీయాంశం అవుతోంది.

‘గేమ్ చేంజర్’ మూవీలో రామ్ చరణ్‌కు జంటగా కియారా అద్వాణీ నటిస్తోంది. ఈ భారీ సినిమాలో శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Tags:    

Similar News