రాజమండ్రి..విశాఖ షెడ్యూల్ తో ముగింపే!
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో `గేమ్ ఛేంజర్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో `గేమ్ ఛేంజర్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 85 శాతం చిత్రీకరణ పూర్తయింది. పెండింగ్ షూట్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని శంకర్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ కి రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత ఏప్రిల్ నెలఖరుకల్లా పూర్తవుతుందని యూనిట్ భావించింది కానీ కాస్త డిలే అవుతున్నట్లు తాజా సమాచారం.
ఈనెల మూడవ వారం నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందని తెలిసింది. చివరి షెడ్యూల్ హైదరాబాద్ లో కాకుండా రాజమండ్రి..విశాఖలో ముగించాలని ప్లాన్ చేసారుట. ఆ రెండు ప్రదేశాల్లో కీలక సన్నివేశాలు చిత్రీక రించనున్నారని సమాచారం. రాజమండ్రి బ్రిడ్జి దగ్గర..వివాఖ బీచ్ వద్ద కొన్ని సన్నివేశాలు చిత్రీకరిం చనున్నారుట.
ఆ రెండు చోట్లే కాకుండా సిటీలో మరికొన్ని చోట్లు షూట్ జరగనుందని సమాచారం. దీంతో సినిమాలో రాజమండ్రి..విశాఖ ప్రాంతాలు బాగా హైలైట్ అవుతాయని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమే రాజమం డ్రిలో జరిగింది. తొలి షెడ్యూల్ అక్కడే భారీ జనసందోహం మధ్య మొదలైంది. అక్కడ కొన్ని రోజుల పాటు షూట్ చేసి అక్కడ నుంచి హైదరాబాద్ కి షిప్ట్ అయింది. అనంతరం విశాఖలోనూ కీలక షెడ్యూల్స్ చేసారు.
హైదరాబాద్ లో షూటింగ్ అంతా రామోజీ ఫిలింసిటీలోని సెట్స్ లోనే జరిగింది. అంటే నేచురల్ లొకేషన్స్ ఏపీ అని తెలుస్తోంది. ఇది పోలిటికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అని ఇప్పటికే ప్రచారంలో ఉంది. `ఒకే ఒక్కడు` రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ఇందులో చరణ్ ఐఎఎస్ ఆఫీసర్ గా...పొలిటిషన్ పాత్రలు పోషిస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆ పాత్రలకు సంబంధించి ఏపీలో ఆ రెండు సిటీలు సినిమాలో కీలకంగా మారుతున్నట్లు తెలుస్తుంది.