గాండీవధారి.. ఇక ఓటీటీ గురి!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం గాండీవదారి అర్జున
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం గాండీవదారి అర్జున. ఈ చిత్రం మొదటిరోజే అతి తక్కువ ఓపెనింగ్స్ తెచ్చుకోవడమే కాకుండా డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. వరుణ్ తేజ్ కెరియర్ లో గని అతి పెద్ద డిజాస్టర్ అంటే అంతకుమించి అనేలా గాండీవదారి ఉండటం విశేషం. ఈ చిత్రంపై నిర్మాత 40 కోట్ల వరకు ఖర్చు చేశారు.
అయితే అందులో కనీసం 10 కోట్లు కూడా రికవరీ కష్టం అనే మాట వినిపిస్తోంది. ది ఘోస్ట్ తో కింగ్ నాగార్జునకి బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చిన ప్రవీణ్ సత్తారు వరుణ్ తేజ్ కి మరో డిజాస్టర్ మూవీ ఇచ్చారు. ఇప్పుడు వరుణ్ తేజ్ హోప్స్ అన్ని కరుణ కుమార్ దర్శకత్వంలో తెరక్కెక్కాల్సిన మట్కాపైన అతని హోప్స్ అన్ని ఉన్నాయి. పీరియాడికల్ జోనర్ లో కంప్లీట్ క్రైమ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ మూవీ తెరకెక్కబోతోంది.
ఇదిలా ఉంటే గాండీవదారి మూవీ థియేటర్స్ లో ఖాళీ అయిపోవడంతో ఇప్పుడు కాస్తా ఎర్లీగా ఓటీటీలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని ముందుగానే ఎక్కువ మొత్తానికి కొనుగోలు చేసింది. అయితే థియేటర్స్ లో డిజాస్టర్ టాక్ రావడంతో నాలుగు వారాల కంటే ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధం చేయాలని భావిస్తోంది. దానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నట్లు టాక్.
సెప్టెంబర్ మూడో వారంలో నెట్ ఫ్లిక్స్ డిజిటల్ రిలీజ్ కి రెడీ చేయొచ్చని భావిస్తున్నారు. మొత్తానికి నార్త్ బ్యూటీ సాక్షి వైద్య హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన ఏజెంట్ బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది. సెకండ్ మూవీ కూడా అంతే స్థాయిలో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాపైన ఈ బ్యూటీ హోప్స్ పెట్టుకుంది. మరి ఆ చిత్రమైన సాక్షి వైద్యకి సక్సెస్ ఇచ్చి టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.
ది ఘోస్ట్ లాంటి డిజాస్టర్ తర్వాత కూడా ప్రవీణ్ సత్తారు మళ్ళీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీ లైన్ తీసుకొని గాండీవదారి అర్జున చేశారు. ఈ చిత్రం ఫలితం కూడా ది ఘోస్ట్ తరహాలోనే ఉంది. మరి నెక్స్ట్ సినిమా విషయంలో అయిన కంటెంట్ పరంగా ప్రవీణ్ సత్తారు ఐడియాలజీ మార్చుకుంటారేమో చూడాలి.