బిగ్ బాస్ 8 : గంగవ్వకి ఆ సమస్య.. హౌస్ నుంచి బయటకు వచ్చేస్తుందా..?

బిగ్ బాస్ సీజన్ 8 లో గంగవ్వ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Update: 2024-11-04 08:15 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో గంగవ్వ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మై విలేజ్ షో ద్వారా పాపులర్ అయిన ఆమె బిగ్ బాస్ సీజన్ 4 లో కూడా ఒక కంటెస్టెంట్ గా వచ్చింది. ఐతే సీజన్ 4లో కేవలం ఐదు వారాలు మాత్రమే ఉండి ఇక ఉండలేనని చెప్పి బయటకు వచ్చేసింది. ఇక సీజన్ 8 లో మళ్లీ వైల్డ్ కార్డ్ గా వచ్చింది. గంగవ్వ వైల్డ్ కార్డ్ ఎంట్రీ చాలామందికి షాక్ ఇచ్చింది. ఐతే వచ్చీరాగానే ఒక టాస్క్ కూడా గెలిచి సర్ ప్రైజ్ చేసింది.

ఐతే వయసు రీత్యా ఆమె పెద్దావిడ కాబట్టి కంటెస్టెంట్స్ ఎవరు ఆమెను ఇబ్బంది పెట్టట్లేదు. అంతేకాదు నామినేషన్స్ లో కూడా గంగవ్వని వదిలేస్తున్నారు. రీసెంట్ గా ఎలిమినేట్ అయిన నయని పావని ఒక్కతే బయటకు వచ్చాక గంగవ్వ ఉన్న కంటెస్టెంట్స్ లో డమ్మీ ప్లేయర్ అని చెప్పింది. ఈ ఏజ్ లో బిగ్ బాస్ కి ఒకసారి కాదు రెండు సార్లు రావడమే గొప్ప విషయం. ఐతే బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ గా వచ్చిన గంగవ్వ నాలుగు వారాలుగా బాగానే ఉంది.

ఇక రీసెంట్ గా హౌస్ లో ఆమెకు కాళ్లు నొప్పులు మొదలైనట్టు తెలుస్తుంది. ఒళ్లు నొప్పులు, కాళ్లు నొప్పులు అంటూ ఆమె చెబుతుంది. శనివారం ఎపిసోడ్ లో నాగార్జునతో కూడా అదే విషయాన్ని చూచాయగా చెప్పింది గంగవ్వ. ఐతే గంగవ్వ తనంతట తాను హౌస్ నుంచి వెళ్తే తప్ప ఆడియన్స్ ఎలిమినేట్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. అందుకే గంగవ్వ కూడా మళ్లీ తనకు తానుగా హౌస్ నుంచి వెళ్లాలని నిర్ణయించుకుందని తెలుస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 8 లో ఆల్రెడీ మణికంఠ ఇలానే హౌస్ లో ఉండటం తన వల్ల కాదని వెళ్లిపోయాడు. అతని వల్ల గౌతం సేవ్ అయ్యాడు. ఇక ఈ వీకెండ్ కూడా గంగవ్వ వెళ్తా అంటే మాత్రం మళ్లీ ఎలిమినేషన్ లేకుండానే గంగవ్వని ఇంటికి పంపిస్తారని తెలుస్తుంది. సీజన్ 8 లో ఆదిత్య ఓం కూడా మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యాడు. సో ఈ సీజన్ సర్ ప్రైజింగ్ ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి.

బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారికి చాలా పెద్ద టఫ్ ఫైట్ అని చెప్పొచ్చు. రోజులు ముగుస్తున్నా కొద్దీ ఆట మరింత టఫ్ అవుతుంది. ఫేక్ అనిపించిన వారిని లేదా ఆట సరిగా ఆడని వారిని ఆడియన్స్ బయటకు పంపించేస్తున్నారు.

Tags:    

Similar News