విశ్వక్ GOG.. సాలీడ్ డీల్ సెట్టయ్యిందిగా!

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కు 'ఫలక్ నామా దాస్' మూవీతో మాస్ కా దాస్ ట్యాగ్ వచ్చిన విషయం తెలిసిందే

Update: 2024-05-01 11:30 GMT

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కు 'ఫలక్ నామా దాస్' మూవీతో మాస్ కా దాస్ ట్యాగ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ట్యాగ్ కు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాలోని లంకల రత్న రోల్ తో న్యాయం జరగనుందని ఇటీవల చెప్పారు విశ్వక్ సేన్. దీంతో ఆ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. గోదావరి జిల్లాల బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం.. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మాస్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్‌ జోనర్ లో రూపొందుతున్న ఈ సినిమా మే17వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్.. సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసింది. టీజర్ లో మాస్ గెటప్‍ లో విశ్వక్‍ సేన్ అదరగొట్టేశారు. గోదావరి యాసలో డైలాగ్స్ తో దుమ్ము దులిపేశారు.

ఇక థియేట్రికల్ రిలీజ్ కు ముందే ఈ సినిమా.. ఓటీటీ డీల్ ను పూర్తి చేసుకుంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. రూ.14 కోట్లు వెచ్చించి నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. అయితే ఓటీటీ మార్కెట్ పడిపోయిందని అందరూ అంటున్న వేళ.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి హక్కులు మంచి ధరకే అమ్ముడుపోయాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. విశ్వక్ క్రేజ్ అలా ఉంది మరి అని అంటున్నారు.

ఇక ఈ సినిమాలో నేహా శెట్టి తో పాటు స్టార్ హీరోయిన్ అంజలి కూడా కీలక పాత్ర పోషిస్తోంది. కొన్ని వారాల క్రితం విడుదలైన ఆమె పోస్టర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. సినిమాలో వేశ్యగా అంజలి కనిపించబోతున్నట్లు సమాచారం. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన మోత మోగిపోద్ది ఐటెం సాంగ్ తో పాటు మిగతా పాటలు కూడా మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకున్నాయి.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ మంచి హిట్ అవుతుందని టీం అంతా నమ్మకంతో ఉంది. మ‌రి విశ్వ‌క్ ప్రేక్ష‌కుల‌ను ఎలా మెప్పిస్తారో చూడాలి.

Tags:    

Similar News