నిత్యామీనన్ పై గౌతమి పెళ్లి ఒత్తిడి..ఇదేంటబ్బా?
ఇదే సమయంలో ఇతర భాషలపైనా దృష్టి పెట్టింది. కానీ అక్కడా రెండు..మూడు సినిమాలు తప్ప పెద్దగా చేసినట్లు కనిపించలేదు
నిత్యామీనన్ కిఇప్పుడు తెలుగులో అవకాశాలు రాని సంగతి తెలిసిందే. అమ్మడు చివరిగా `భీమ్లా నాయక్` లో నటించింది. ఆ తర్వాత మరే తెలుగు సినిమాలోనూ నటించలేదు. వాస్తవానికి అంతకు ముందు నుంచే తెలుగు అవకాశాలు తగ్గాయి. ఈ క్రమంలో బుల్లి తెరపై హోస్ట్ గా బిజీ అయింది. ఇదే సమయంలో ఇతర భాషలపైనా దృష్టి పెట్టింది. కానీ అక్కడా రెండు..మూడు సినిమాలు తప్ప పెద్దగా చేసినట్లు కనిపించలేదు.
ఈ నేపథ్యంలో వెబ్ సిరీస్ లపైనా దృష్టి పెట్టి ముందుకెళ్తుంది. తాజాగా ఇటీవలే ‘కుమారి శ్రీమతి’ అనే సిరీస్ లో నటించింది. దీనికి విశేషాదరణ లభిస్తుంది. ఈ సందర్భంగా నిత్యామీనన్ ఆనందాన్ని అభిమాను లతో పంచుకుంది. ` నా లైఫ్‌కి చాలా దగ్గరగా అనిపించే కథ ఇది. 30ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా లక్ష్యం అంటూ తిరిగే పాత్రను పోషించా. నా నిజ జీవితంలోనూ అలేగే జరిగింది.
అందుకే ఈ కథ వ్యక్తిగతంగా నాకు బాగా కనెక్ట్ అయింది. ఆ పాత్రలో నటించడం సులభమైంది. నేను కూడా దాదాపు శ్రీమతి టైపే. ఈ సిరీస్‌లో నా తల్లి పాత్ర పోషించిన గౌతమిగారు నన్ను పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చేవారు. నిజ జీవితంలో మా అమ్మ బ్రతికున్నంత కాలంగా ఇలాఏ పెళ్లి చేసుకో అమ్మ అని బ్రతిమలాడేది. నువ్వేం సాధించావ్.. ప్రశాంతంగా పెళ్లి చేసుకో.. నీకెందుకు ఈ సినిమాలు’ అంటూ తెగ ఇబ్బంది పెట్టేది.
ఈ పాత్ర చేస్తున్నప్పుడు గౌతమిగారిలో మా అమ్మను చూశాను. అందుకే గౌతమి గారిని చూస్తుంటే నాకు మా అమ్మ గుర్తొస్తుంది. జీవితానికి సంబంధించి ఎన్నో మంచి విషయాలు చెబుతారు. అవి నన్నెంతో ఆకర్షిస్తాయి. మంచి ఎవరు చెప్పినా తీసుకోవాలి. ఆలా గౌతిమ మేడం నుంచి చాలా విషయాలు నేర్చుకు న్నాను..తెలుసుకున్నాను` అని అన్నారు