మహేష్ బాబు కొడుకు వీడియో.. రీల్స్ లో వైరల్
ఇప్పుడు సోషల్ మీడియాలో గౌతమ్ కు సంబంధించిన మరో వీడియో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కిడ్స్ గురించి అందరికీ తెలిసిందే. కొడుకు గౌతమ్, కూతురు సితార ఇద్దరూ పాపులరే. మహేష్ నటించిన వన్ నేనొక్కడినే మూవీతో సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన గౌతమ్.. ఆ సినిమాలో చిన్ననాటి సూపర్ స్టార్ గా కనిపించి మెప్పించాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు మరో సినిమాలో నటించలేదు. ప్రస్తుతం తన ఎడ్యుకేషన్ పై కంప్లీట్ ఫోకస్ పెట్టాడు. న్యూయార్క్ లో చదువుకుంటున్నట్లు నమ్రత ఆ మధ్య తెలిపారు.
అయితే గౌతమ్.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటాడు. కొద్ది రోజుల క్రితం తన న్యూయర్క్ యూనివర్సిటీ లైఫ్ గురించి షేర్ చేసుకున్నాడు. తన ఫ్రెండ్స్ తో కలిసి తిరగడం నుండి రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించడం వరకు గౌతమ్.. అన్ని విషయాలను సరదాగా పోస్ట్ చేశాడు. డిడ్డీ యూనివర్సిటీ పార్ట్ 2 అంటూ క్రేజీగా క్యాప్షన్ ఇచ్చాడు. ఆ తర్వాత పార్ట్ 3, పార్ట్ 4 పేర్లతో పిక్స్ షేర్ చేయగా.. నెట్టింట తెగ చక్కర్లు కొట్టాయి.
ఇప్పుడు సోషల్ మీడియాలో గౌతమ్ కు సంబంధించిన మరో వీడియో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. న్యూయార్క్ యూనివర్సిటీ దగ్గర ఓ యూజర్ చేసిన రీల్ లో గౌతమ్ తన ఫ్రెండ్స్ తో కలిసి కనిపించారు. అందులో యూట్యూబర్.. మూడు బాలీవుడ్ సాంగ్స్ మ్యూజిక్ ను ప్లే చేస్తా.. సినిమా పేర్లను గెస్ చేస్తే 100 డాలర్స్ ఇస్తానని గౌతమ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ కు చెబుతారు. ఫస్ట్ దేశీ గర్ల్ పాట ప్లే చేయగా.. గౌతమ్ ఫ్రెండ్స్ దోస్తానా మూవీ సాంగ్ అని చెప్పేస్తారు.
ఆ తర్వాత కపూర్ అండ్ సీన్స్ మూవీలో పాటను గెస్ చేసేస్తారు. ఆ తర్వాత గౌతమ్.. తనది హైదరాబాద్ ఇండియా అని చెబుతాడు. బాలీవుడ్ మ్యూజిక్ వైబ్ టు ఎనీ థింగ్ అని అంటాడు. మూడో సాంగ్ నూ గుర్తు పట్టడంతో యూజర్.. గౌతమ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ కు 100 డాలర్లు ఇస్తారు. వాటితో ఏం చేస్తారని అడగ్గా.. పానీ పూరి తింటామని చెబుతారు. దీంతో గౌతమ్ ఫుల్ గా నవ్వాడు. ఆ వీడియో ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది.
దీంతో మహేష్ ఫ్యాన్స్ ఆ వీడియో ఫుల్ గా షేర్ చేస్తున్నారు.. గౌతమ్ బాబు వాయిస్ లో బేస్ అదిరిపోయిందని చెబుతున్నారు. చిన్న పులి అంటూ సందడి చేస్తున్నారు. గౌతమ్ బాబు మాస్ అని అంటున్నారు. మొత్తానికి గౌతమ్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడని చెబుతున్నారు. కొందరు సరదాగా క్లాస్ బంక్ కొట్టాడని మహేష్ కు కంప్లైంట్ చేస్తున్నారు. అలా సోషల్ మీడియాలో గౌతమ్ ఉన్న రీల్ తెగ ట్రెండ్ అవుతోంది. మరి మీరు చూశారా?