గౌతమ్ మీనన్ చేసిన అతిపెద్ద తప్పు!
గౌతమ్ మీనన్ ఇటీవల ఊహించని విధంగా కొన్ని కామెంట్స్ చేశాడు. చాలా రోజులుగా నాకు మనశ్శాంతి అనేది లేదు. నా కుటుంబం కూడా ఆందోళనలో ఉంది ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లిపోవాలని అనిపిస్తుంది
గౌతమ్ మీనన్ ఈ పేరు వినగానే అందరికీ కొన్ని ప్రేమకథలు గుర్తొస్తాయి. లవ్ స్టోరీలను అలాగే సీరియస్ పోలీస్ కథలను తెరపైకి తీసుకురావడంలో గౌతమ్ సిద్ధహస్తుడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో గౌతమ్ మార్క్ కు తగ్గ లవ్ స్టోరీ లో ఉంటాయి. ఇక అతన్ని చూసి దర్శకులు అవుదామని అనుకున్న యువకుల లిస్ట్ కూడా చాలా పెద్దగానే ఉంది.
తెలుగులో కూడా అతనికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. కేవలం గౌతమ్ మీనన్ బ్రాండ్ తో ఒకప్పుడు సినిమాలకు మంచి మార్కెట్ అయితే ఏర్పడింది. కానీ గత పదేళ్ళలో చూసుకుంటే మాత్రం అతని రేంజ్ ఒక్కసారిగా పడిపోయింది. ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్సాఫీస్ వద్ద అసలు సక్సెస్ ఇవ్వడం లేదు. చేసిన సినిమాలు కూడా అనుకున్న టైమ్ కు రిలీజ్ కావడం లేదు. దానికి తోడు ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి.
గౌతమ్ మీనన్ ఇటీవల ఊహించని విధంగా కొన్ని కామెంట్స్ చేశాడు. చాలా రోజులుగా నాకు మనశ్శాంతి అనేది లేదు. నా కుటుంబం కూడా ఆందోళనలో ఉంది ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లిపోవాలని అనిపిస్తుంది అన్నట్లు ఒక సినిమా విడుదల విషయంలో మాట్లాడాడు. దీన్నిబట్టి అతను ఎంతగా ఆవేదన చెందుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. దీనికి కారణం ఏంటి అనే వివరాల్లోకి వెళితే అనవసరంగా తొందరపడి గౌతమ్ మిస్టేక్ చేసినట్లు అనిపిస్తుంది.
2010 వరకు అతని కెరీర్ బాగానే ఉంది. మిన్నలే అనే సినిమాతో మొదలైన అతని కెరీర్ ఆ తర్వాత ఏ మాయ చేసావే వరకు కూడా బాగా కొనసాగింది. ఇతర నిర్మాతలతో సినిమా చేస్తూ మంచి రెమ్యునరేషన్ అందుకుంటూ వచ్చాడు. మధ్యలో ఘర్షణ సినిమా కూడా అటు తమిళంలో సూర్య చేయగా తెలుగులో వెంకటేష్ చేశాడు. రెండు కూడా కమర్షియల్ గా మంచి లాభాలను అందించాయి.
ఇలా అతని కెరీర్ బాగానే ఉన్న సమయంలోనే 2011లో ఒక పెద్ద తప్పు చేశాడు. ముంబై అలాగే తమిళనాడులో ఫైనాన్షియర్స్ దగ్గర నుంచి దాదాపు రెండేళ్ళ వ్యవధిలోనే 80 కోట్ల వరకు అప్పు చేశాడు. ఆ డబ్బుతో సినిమాలను సొంతంగా డైరెక్ట్ చేయడమే కాకుండా నిర్మించాడు. అయితే ఎ సినిమా కూడా అతనికి అనుకున్నంత స్థాయిలో లాభాలను అందించలేదు. అందులో నానితో చేసిన 'ఎటో వెళ్లిపోయింది మనసు' కూడా ఉంది. ఇక ఏ మాయ చేసావే సినిమాను హిందీలో రీమేక్ చేశాడు. అది కూడా దెబ్బ కొట్టింది.
మధ్యలో ఇక సాహసం శ్వాసగా సాగిపో అనే సినిమా చేశాడు. దాన్ని తమిళంలో శింబూతో చేయగా అతను సరైన టైమ్ కు షూటింగ్ కు రాక గౌతమ్ ఇబ్బంది పడాల్సి వచ్చింది. రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. ఈ విధంగా దాదాపు రెండేళ్ల వ్యవధిలో 80 కోట్ల వరకు పోగొట్టుకున్న అతను ఇప్పుడు నటుడిగా మరి ఆర్థికంగా నిలదోక్కుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. కొత్తగా పెద్ద హీరోలతో సినిమాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ సరైన అవకాశాలు రావడం లేదు. అంతే కాకుండా గౌతమ్ మేకింగ్ స్టైల్ ఇంకా అతని రెగ్యులర్ తరహా లోనే ఉండడం బోరింగ్ గా ఉంది అనే కామెంట్స్ వస్తున్నాయి. మరి ఈ కష్టాల కడలి నుంచి అతను ఎప్పుడు బయటపడతాడో చూడాలి.