స్టార్ హీరో సినిమా ఇన్నాళ్లు వాయిదాకు కారణం ఇదేనట!
చిన్న హీరోలు, చిన్న దర్శకుల సినిమాలు షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత విడుదల అయ్యే వరకు నమ్మకం ఉండదు
చిన్న హీరోలు, చిన్న దర్శకుల సినిమాలు షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత విడుదల అయ్యే వరకు నమ్మకం ఉండదు. చిన్న బడ్జెట్ సినిమాలు చాలా విడుదలకు నోచుకోకుండా ఉంటాయి. చాలా వరకు ఆర్థిక సమస్యల కారణంగా అసంపూర్తిగా ఉండి పోతాయి. కొన్ని థియేట్రికల్ రిలీజ్ లేకుండా డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతాయి.
పెద్ద హీరోల సినిమాలు, స్టార్ దర్శకుల సినిమాలు మధ్య లో ఆగిపోవడం, షూటింగ్ అయ్యాక విడుదల అవ్వకుండా ఉండటం అనేది మనం చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. స్టార్ హీరో విక్రమ్ నటించిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ధృవనక్షత్రం సినిమా చాలా ఏళ్ల క్రితం షూటింగ్ పూర్తి అయినా కూడా విడుదలకు నోచుకోవడం లేదు.
ఎట్టకేలకు ధృవనక్షత్రం సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈనెల 24న విడుదల చేయబోతున్న సినిమా పై అంచనాలు పెంచే విధంగా ప్రమోషన్ చేస్తున్నారు. ఇన్నాళ్లు ఈ సినిమా విడుదల కాకుండా వాయిదా పడటానికి కారణం ఏంటి అనే విషయమై దర్శకుడు గౌతమ్ మీనన్ తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.
ఆయన మాట్లాడుతూ.. ధృవనక్షత్రం సినిమా విడుదల కాకపోవడం కు పూర్తి బాధ్యత తనదే. నా యొక్క ఆర్థిక సమస్యల కారణంగానే సినిమా విడుదల అవ్వలేదు. నేను డబ్బులు ఇవ్వాల్సిన వారు కోర్టుకు వెళ్లడం వల్ల సినిమా విడుదల చేయలేక పోయాను. వారితో కోర్టు బయట సెటిల్‌మెంట్ కు రెడీ అయ్యాం. అందుకే సినిమా విడుదలకు ఓకే చెప్పారు.
ఈ సినిమా పాత సినిమా అనే ఉద్దేశ్యంతో చాలా మంది ఓటీటీ వారిని సంప్రదించినా కూడా తీసుకునేందుకు నో చెప్పారు. అయితే సినిమా మొత్తం ను కూడా వారికి థియేటర్ లో వేసి చూపించిన తర్వాత కొనుగోలు చేసేందుకు ఓకే చెప్పారంటూ దర్శకుడు గౌతమ్ మీనన్ తెలియజేశాడు.