ఎలుక కారణంగానే ఆ సెలబ్రిటీ జోడీ మృతి!
ఆస్కార్ అవార్డు విన్నర్ జీన్ హాక్ మాన్-ఆయన భార్య బెట్సీ అరక్వా తో పాటు పెంపుడు కుక్క లాస్ ఏంజిల్స్ లోని తమ ఇంట్లో అనుమానాదస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే.;
ఆస్కార్ అవార్డు విన్నర్ జీన్ హాక్ మాన్-ఆయన భార్య బెట్సీ అరక్వా తో పాటు పెంపుడు కుక్క లాస్ ఏంజిల్స్ లోని తమ ఇంట్లో అనుమానాదస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా ఇద్దరు మృతి చెందడంతో పోలీసులు అనుమానాదస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన జరిగి వారం రోజులవుతుంది.
తాజాగా మృతికి గల అసలు కారణాలు బయటకు వచ్చాయి. విచారణ చేపట్టిన పోలీసులు ఆ రెండు మరణాలు సహజంగానే జరిగినట్లు తేల్చారు. తాజాగా అందుకు కారణం ఓ వైరస్ అని డాక్టర్లు నిర్దారించారు. బెట్సీహరక్వా హంటావైరస్ పల్మోనరీ సిండ్రోమ్ వ్యాధి వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్దారించారు. న్యూ మెక్సికో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హీతలర్ జారెల్ హాక్ మాన్ మృతి గురించి కూడా ప్రకటన చేసారు.
గుండెపోటుతో జీన్ హాక్ మాన్ మృతి చెందాడని అతడికి అల్జీమర్ వ్యాధి కూడా ఉన్నట్లు తేల్చారు. జీన్ హాక్ మాన్ కు అల్జీమర్స్ పెరిగి పోవడం వల్ల అతడి భార్య మృతి చెందింది అన్న విషయాన్ని కూడా గుర్తించలేకపోయారన్నారు. అయితే ఈ వైరస్ ఆయనకు సోకిందా? లేదా? అన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. హంటా వైరస్ గురించి మాట్లాడుతూ` ఇది ఎలుకలు నుంచి వ్యాపిస్తుందన్నారు. అయితే మానవులకు ఇది అంత తొందరగా వ్యాపించదని చెప్పారు.
ఈ వైరస్ కు ఎలాంటి వైద్యంగానీ, మందులుగానీ లేవన్నారు. ముందస్తు జాగ్రత్తలు పాటించడమే నివారణ మార్గంగా సూచించారు. హంటావైరస్‌తో తీవ్ర శ్వాసకోస వ్యాధులు వస్తాయి. జ్వరం కూడా తీవ్రంగా ఉంటుంది. కిడ్నీ, మూత్రాశయ వ్యాధులు కూడా వస్తాయి. వాటి మూత్రం, లాలాజలం, మలం ద్వారా ఈ వైరస్ ప్రబలుతుందన్నారు.