రెండుసార్లు ఆస్కార్ విజేత అనుమానాస్పద మృతి
ప్రముఖ నటుడు, అతడి భార్య, పెంపుడు కుక్క అనుమానాస్పద మృతి కలకలం రేపింది.;
ప్రముఖ నటుడు, అతడి భార్య, పెంపుడు కుక్క అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ఆరు దశాబ్ధాల కెరీర్‌లో రెండు ఆస్కార్ అవార్డులతో 80 చిత్రాల్లో నటించిన హాలీవుడ్ ప్రముఖ నటుడు జీన్ హాక్‌మన్, తన భార్య పియానిస్ట్ బెట్సీ అరకావా, ఇంట్లో వారి పెంపుడు కుక్కతో పాటు మరణించారని న్యూ మెక్సికోలోని శాంటా ఫేలోని షెరీఫ్ కార్యాలయం ప్రకటించింది. నటుడు నటుడి భార్య మరణాలను అనుమానాస్పద మరణాలుగా భావిస్తున్నారు.
అతడి వయసు 95. భార్య వయసు 64. బుధవారం మధ్యాహ్నం 1:45 గంటలకు మరణించినట్లు హాలీవుడ్ మీడియాలో కథనాలొచ్చాయి. ఈ మరణాల వెనక `అసభ్యకరమైన ఆట` ఏదైనా ఉందా? అనే అనుమానం లేదు. అయితే మరణానికి కచ్చితమైన కారణం ఏదీ తేలలేదు. శాంటా ఫే కౌంటీ షెరీఫ్ కార్యాలయం చురుగ్గా దర్యాప్తు చేస్తోంది అని తెలుస్తోంది.
1960ల ఆరంభం హాక్ మన్ కెరీర్ మొదలైంది. అతడు 80కి పైగా చిత్రాలలో, పలు టెలివిజన్ సిరీస్‌లలో నటించాడు. 1967లో వచ్చిన `బోనీ అండ్ క్లైడ్` సినిమాలో బ్యాంక్ దొంగకు సోదరుడిగా నటించాడు. ఈ అద్భుతమైన పాత్రకు ఆయన తొలి ఆస్కార్ నామినేషన్ పొందారు. 1971లో `ఐ నెవర్ సాంగ్ ఫర్ మై ఫాదర్` సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా కూడా నామినేట్ అయ్యారు. దర్శకుడు విలియం ఫ్రైడ్కిన్ థ్రిల్లర్ `ది ఫ్రెంచ్ కనెక్షన్`లో అంతర్జాతీయ మాదకద్రవ్యాల డీలర్లను వెంబడించే న్యూయార్క్ డిటెక్టివ్ పొపాయ్ డోయల్ పాత్రలో నటించగా అతడి స్టార్ డమ్ పరాకాష్టకు చేరుకుంది. ఈ పాత్ర ఉత్తమ నటుడిగా అకాడమీ అవార్డును ఇచ్చింది. క్లింట్ ఈస్ట్‌వుడ్ వెస్ట్రన్ `అన్‌ఫర్గివెన్`లో షెరీఫ్‌గా 1993లో ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్‌ను కూడా గెలుచుకున్నాడు. 1988 హిస్టారికల్ డ్రామా `మిస్సిస్సిప్పి బర్నింగ్`లో ఎఫ్.బి.ఐ ఏజెంట్ పాత్రతో అకాడమీ అవార్డుకు నామినేట్ అయ్యాడు.
హాక్‌మన్ ప్రత్యేకత... తెరపై భయంకరమైన విలన్ గా అయినా మంచి స్నేహితుడిగా, ఆప్తుడిగాను నటించగలడు. రోజువారీ గని కార్మికుడుగాను అతడు జీవించగలడు.