కీర్తి బాలీవుడ్ డెబ్యూ మూవీలో జాకీ ష్రాఫ్.. గ్లింప్స్ వేరే లెవెల్!

విజయ్, సమంత, అమీ జాక్సన్ హీరో హీరోయిన్లుగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ తెరికి రీమేక్ గా రూపొందుతోంది.

Update: 2024-10-12 16:41 GMT

నేషనల్ అవార్డు విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ బీ టౌన్ లోకి బేబీ జాన్ మూవీతో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఆ సినిమాకు కాలీస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంటెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ గా మురాద్‌ ఖేతానీ, ప్రియా అట్లీ, జ్యోతి దేశ్‌ పాండే సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వామిక గబ్బి కీలక పాత్రలో కనిపించనున్నారు. విజయ్, సమంత, అమీ జాక్సన్ హీరో హీరోయిన్లుగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ తెరికి రీమేక్ గా రూపొందుతోంది.

అయితే హిందీ నేటివిటీకి తగ్గట్టు బేబీ జాన్ సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ కాలీస్. ఇప్పటికే వరుణ్ ధావన్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తన కోపానికి కారణమైన వారికి సమాధానం చెప్పేంత శక్తి తనకు ఉన్నప్పుడు ఆ వ్యక్తి కంటే మించిన క్రూరమైన మృగం మరొకటి ఉండదంటూ పోస్టర్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ పెంచారు. రక్తంతో తడిసిన బాడీతో వరుణ్‌ ధావన్ కనిపిస్తున్న లుక్.. మంచి రెస్పాన్స్ అందుకుంది.

క్రిస్మస్ కానుకగా సినిమాను రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన మేకర్స్.. ఇప్పుడు ప్రమోషన్స్ లో మెల్లగా స్పీడ్ పెంచారు. దసరా కానుకగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు. మూవీలో బాలీవుడ్ సీనియర్ హీరో జాకీ ష్రాఫ్ నటిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. బాబర్ షేర్ గా కనిపించనున్నట్లు తెలిపారు. స్పెషల్ పోస్టర్ ను షేర్ చేస్తూ.. గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ లో జాకీ ష్రాఫ్ వేరే లెవెల్ లో ఉన్నారు. లాంగ్ హెయిర్ తో తన ఆయన లుక్.. ఇప్పుడు మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.

గ్లింప్స్ లో జాకీ ష్రాఫ్ అప్పీరియన్స్ అయితే ఓ రేంజ్ లో ఉంది. కత్తులు, కొడవళ్ళు పట్టుకుని ఉన్న కొందరి వెనుక ఆయన.. బీడీ కాల్చుతూ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత క్రూరంగా కొడవలితో నరుకుతూ కనిపించారు. గ్లింప్స్ వైల్డ్ గా ఉందని చెప్పాలి. మొత్తానికి బేబీ జాన్.. బాలీవుడ్ ఆడియన్స్ కు బాగా ఎక్కేటట్లు తెరకెక్కిస్తున్నట్లు గ్లింప్స్ ద్వారా అర్థమవుతోంది. అయితే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్.. బేబీ జాన్ మూవీకిగాను వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు జాకీ ష్రాఫ్ గ్లింప్స్ ను కూడా ఆయనే షేర్ చేశారు. మరి సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

Full View
Tags:    

Similar News