ఎర్ర చీరలో సన్నజాజి నడుము

తాజాగా ఈ అమ్మడు ఎర్ర చీరలో వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలలో జ్ఞానేశ్వరి ఇట్టే ఆకట్టుకుంటుంది.

Update: 2024-12-15 17:30 GMT

ప్రదీప్ 'పెళ్లి చూపులు' రియాలిటీ షోతో బాగా పాపులర్ అయిన అందాల భామ జ్ఞానేశ్వరి కాండ్రేగుల. ఈ వైజాగ్ బ్యూటీ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత పెళ్లి చూపులు రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసి విన్నర్ గా నిలిచింది. తరువాత యుట్యూబ్ వెబ్ సిరీస్ లలోకి ఎంట్రీ ఇచ్చింది. తరువాత 'మిస్టర్ అండ్ మిస్' మూవీతో హీరోయిన్ గా బిగ్ స్క్రీన్ పైకి అడుగుపెట్టింది.

 

చిన్న సినిమాలలో ఈ అమ్మడు లీడ్ రోల్ చేస్తూనే కాస్తా ఫేమ్ ఉన్న చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ వస్తోంది. నాగ చైతన్య 'దూత' వెబ్ సిరీస్ లో జ్ఞానేశ్వరి చేసిన జర్నలిస్ట్ రోల్ కి మంచి గుర్తింపు వచ్చింది. అలాగే నవీన్ చంద్ర 'మంత్ ఆఫ్ మధు' సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించింది. 'మాయలో' అనే మరో మూవీలో గ్లామర్ రోల్ లో సందడి చేసింది.

 

ఈ అమ్మడు చేసిన సినిమాలు భారీ స్థాయిలో సక్సెస్ కాకపోయిన మంచి టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకుంది. మంచి కమర్షియల్ బ్రేక్ కోసం జ్ఞానేశ్వరి వెయిట్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఇన్ స్టాగ్రామ్ లో జ్ఞానేశ్వరి చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఫిట్ నెస్ ఫ్రీక్ అయిన ఈ అమ్మడు రెగ్యులర్ గా తన అప్డేట్స్ ని ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంటుంది. అప్పుడప్పుడు గ్లామర్ ఫోటోలని కూడా షేర్ చేస్తూ ఉంటుంది.

 

ఈ ఫోటోలు వైరల్ అవుతాయి. అదిరిపోయే రేంజ్ లో గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్ళని తన అందంతో జ్ఞానేశ్వరి కట్టిపడేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు ఎర్ర చీరలో వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలలో జ్ఞానేశ్వరి ఇట్టే ఆకట్టుకుంటుంది. ఆమె ఫ్యాన్స్ కూడా ఫోటోలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎప్పుడు మోడ్రన్ అవుట్ ఫిట్ లతో కనిపించే ఈ అమ్మడు సిల్క్ శారీలో బెడ్ పైన పడుకొని తీసుకున్న ఈ ఫోటోలకి అదిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ వస్తున్నాయి.

Tags:    

Similar News