బడా నిర్మాత క్షమాపణలు చెప్పాడు
ఎట్టకేలకు బడా నిర్మాతగా పేరు దక్కించుకున్న జ్ఞానవేల్ రాజా దర్శకుడు అమీర్ కి క్షమాపణలు చెప్పాడు.
కార్తీ బెంచ్ మార్క్ 25వ సినిమా జపాన్ ఫంక్షన్ కి ఆయనతో వర్క్ చేసిన దర్శకులందరిని ఆహ్వానించడం జరిగింది. కానీ కార్తీ మొదటి సినిమా పరుత్తివీరన్ దర్శకుడు అమీర్ ను మాత్రం ఆహ్వానించలేదు. పైగా ఆయన్ను ఆహ్వానించాం.. కానీ ఆయన మా సినిమా వేడుకకి రాలేదు అంటూ నిర్మాత జ్ఞానవేల్ రాజా వ్యాఖ్యలు చేశాడు.
ఆ వెంటనే దర్శకుడు అమీర్ స్పందిస్తూ తనకు ఆహ్వానం అందలేదని క్లారిటీ ఇచ్చాడు. పరుత్తివీరన్ సినిమా షూటింగ్ సమయంలో అమీర్ మరియు జ్ఞానవేల్ రాజా మధ్య విభేదాలు తలెత్తి నిర్మాణం నుంచి మధ్యలో వెళ్లి పోయాడు. కానీ అమీర్ ఆ సినిమాను ఏదో విధంగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.
నిర్మాత జ్ఞానవేల్ రాజా మాత్రం తనను ఆ సినిమా సమయంలో అమీర్ చాలా ఇబ్బంది పెట్టాడు అంటూ ఆరోపించాడు. నిర్మాత జ్ఞానవేల్ రాజా ఆరోపణలను సముద్రఖని వంటి వారు చాలా మంది తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. జ్ఞానవేల్ రాజా ఆరోపణలు నిజం కాదని చాలా మంది అన్నారు.
ఎట్టకేలకు బడా నిర్మాతగా పేరు దక్కించుకున్న జ్ఞానవేల్ రాజా దర్శకుడు అమీర్ కి క్షమాపణలు చెప్పాడు. అమీర్ ను నేను ఎప్పుడు కూడా అమీర్ అన్నా అనే పిలుస్తాను. ఆయన అంటే గౌరవం ఉంది. ఆయన ఒకానొక సందర్భంగా చేసిన విమర్శలు నన్ను బాధించాయి. అందుకే ఆయన మనసు గాయ పడే విధంగా మాట్లాడాను. అందుకు క్షమాపణలు అడుగుతున్నాను అన్నాడు.
ఈ వివాదంలో సూర్య మరియు కార్తీ పేర్లు ప్రముఖంగా మీడియాలో వినిపిస్తున్నాయి. దాంతో వారిద్దరి సూచన మేరకు ఈ వివాదాన్ని ముగించాలి అనే ఉద్దేశ్యంతో అమీర్ కి జ్ఞానవేల్ రాజా క్షమాపణలు చెప్పాడు అంటూ తమిళ్ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.