GOAT: డిజాస్టర్ టైమ్ లో మరో దెబ్బ

మూవీ రిలీజ్ రోజు సాయంత్రానికి పైరసీలో ఆ సినిమాలు ఆన్ లైన్ లో ప్రత్యక్షం అవుతున్నాయి.

Update: 2024-09-28 06:22 GMT

సినిమా ఇండస్ట్రీకి చాలా కాలంగా పైరసీ మాఫియా పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్న ఈ సినిమాల పైరసీని మాత్రం అరికట్టలేకపోతున్నారు. ముఖ్యంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కే పాన్ ఇండియా సినిమాలు పైరసీ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మూవీ రిలీజ్ రోజు సాయంత్రానికి పైరసీలో ఆ సినిమాలు ఆన్ లైన్ లో ప్రత్యక్షం అవుతున్నాయి.

తమిళ్ రాకర్స్ గ్రూప్ హెడ్ ని ఆ మధ్యకాలంలో పోలీసులు పట్టుకున్నారు. ఎప్పటికప్పుడు ఈ పైరసీ సినిమాల వెబ్ సైట్స్ ని బ్లాక్ చేస్తూనే ఉన్నారు. అయినా కూడా కొత్త లింక్ లు పుట్టుకొస్తున్నాయి. ఈ పైరసీ ఎఫెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ పైన కూడా పడుతోంది. సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయిన మరుసటి రోజే HD ప్రింట్ తో ఆన్ లైన్ లో లోకి వచ్చేస్తున్నాయి.

అయితే ఇప్పుడు దళపతి విజయ్ ‘ది గోట్’ మూవీ పైరసీకి గురైంది. ఓటీటీలో రిలీజ్ కాకుండానే క్వాలిటీ ఆడియోతో HD ప్రింట్ ఆన్ లైన్ లో ప్రత్యక్షం అయ్యింది. ఇది మేకర్స్ కి షాక్ కి గురిచేసింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. అక్టోబర్ 3న నెట్ ఫ్లిక్స్ లో ‘ది గోట్’ మూవీ రిలీజ్ కానుంది. ఈ లోపే మూవీ HD ప్రింట్ ని పైరసీ మాఫియా ఆన్ లైన్ లో పెట్టేసింది.

దీనిని తొలగించే పనిలో ఇప్పుడు మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. తమిళ్ నిర్మాతల మండలి, సైబర్ క్రైమ్ పోలీసులు ఈ పైరసీ మాఫియాపై నిరంతర పర్యవేక్షణ చేస్తున్న కూడా డ్యామేజ్ అరికట్టలేకపోతున్నారు. పైరసీ మాఫియాని నడుపుతున్న తమిళ్ రాకర్స్, తమిళ్ బ్లాస్టర్స్ రకరకాల మార్గాలలో సినిమాలు పైరసీ చేసి వారి వెబ్ సైట్స్ లలో రిలీజ్ చేస్తున్నారు.

ఇప్పుడు ‘ది గోట్’ మూవీ పైరసీ బారిన పడటంతో నెట్ ఫ్లిక్స్ సంస్థ ఎలా రియాక్ట్ అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘ది గోట్’ మూవీ సెప్టెంబర్ 5న థియేటర్స్ లో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యింది. మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఓవరాల్ గా 400 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన మూవీ ప్రేక్షకులని పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. ఇక నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాకముందే ఇలా ఆన్ లైన్ లో లీక్ అవ్వడం మరో పెద్ద దెబ్బ.

Tags:    

Similar News