వరుస పోస్టర్లతో అగ్గి రాజేస్తున్న GOAT
వరుస పోస్టర్లతో విజయ్ బృందం చాలా హైప్ పెంచేస్తున్నారు. దళపతి విజయ్ ఏదో సంథింగ్ స్పెషల్ గా చేస్తున్నాడు.. అదేంటో తెలుసుకోవాలనే క్యూరియాసిటీని పెంచేస్తున్నాడు.
ఆర్.ఆర్.ఆర్- కేజీఎఫ్- పుష్ప- విక్రమ్- సలార్.. ఇవన్నీ వరుసగా పాన్ ఇండియా లో సంచలన విజయాల్ని నమోదు చేసాయి. లియో చిత్రంతో విజయ్ బ్లాక్ బస్టర్ కొట్టాడు కానీ ఇరుగు పొరుగు భాషల్లో అంత సీన్ కనిపించలేదు. దీంతో ఇప్పుడు దళపతి భారీ పాన్ ఇండియా విజయం కోసం స్కెచ్ వేసాడని భావించాల్సి వస్తోంది.
వెంకట్ ప్రభు మూవీతో గేమ్ ఛేంజర్ కావాలనుకుంటున్నాడనే అర్థమవుతోంది. కొత్త సంవత్సరం కానుకగా GOAT (ది గ్రేటెస్ట్ ఆప్ ఆల్ టైమ్) టైటిల్ ని ప్రకటించడమే గాక పోస్టర్ లో ద్విపాత్రాభినయంతో క్యూరియాసిటీని పెంచాడు. యువకుడిగా, నడి వయస్కుడిగా విజయ్ కనిపిస్తున్నాడు ఈ పోస్టర్ లో. ఇప్పుడు 'గోట్' సెకండ్ లుక్ ఇంకా ఉత్కంఠను పెంచింది. ఇది రెగ్యులర్ పోస్టర్ కాదు. సరిగా గమనిస్తే ఏదో స్పెషల్ కనిపిస్తోంది.
వరుస పోస్టర్లతో విజయ్ బృందం చాలా హైప్ పెంచేస్తున్నారు. దళపతి విజయ్ ఏదో సంథింగ్ స్పెషల్ గా చేస్తున్నాడు.. అదేంటో తెలుసుకోవాలనే క్యూరియాసిటీని పెంచేస్తున్నాడు. మరోవైపు గతంలో పాన్ ఇండియాతో సంబంధం లేకుండా సాధారణ చిత్రాలు తీసిన వెంకట్ ప్రభుకి అంత సీనుందా? అనే సందేహం కూడా ఎక్కడో అందరిలో ఉంది. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ ప్రపంచం లేదా సలార్ ప్రపంచం.. నాగ్ అశ్విన్ కల్కి ప్రపంచంలా వెంకట్ ప్రభు కూడా ఏదో పెద్ద ప్రయోగం చేస్తున్నాడనే భావించాల్సి వస్తోంది.
వెంకట్ ప్రభుతో విజయ్ 68వ చిత్రం ప్రత్యేకతను చాటుకుంటోంది. GOAT అనే టైటిల్ ఎంతో ఆకర్షిస్తోంది. తాజా పోస్టర్‌లో ఇద్దరు విజయ్‌లు మోటార్‌సైకిల్‌పై తమ ప్రత్యర్థులపై తుపాకీలతో కాల్పులు జరుపుతున్నారు. బైక్‌ను నడుపుతున్న విజయ్ పెద్దవాడిగా దృఢ నిశ్చయంతో కనిపిస్తున్నాడు. అయితే పిలియన్‌పై ఉన్న వ్యక్తి కంప్యూటర్‌లో రూపొందించిన ఇమేజ్ లా కనిపిస్తోంది. ది GOAT ఒక సైన్స్ ఫిక్షన్ చిత్రం కావచ్చునని ఇండికేషన్ స్పష్ఠంగా ఉంది. పోస్టర్ సెట్లో రూపొందించిన విజువల్ నుంచి వచ్చింది. సాధారణ పరిసరాల కంటే భిన్నంగా ఇది కనిపిస్తోంది. పెద్ద విజయ్ పిస్టల్ పట్టుకుని ఉండగా.. చిన్నవాడు నేరుగా కెమెరా వైపు చూస్తూ మెషిన్ గన్‌తో షూట్ చేస్తున్నాడు.
ఇంతకుముందు, వెంకట్ ప్రభు ఈ చిత్రం సెట్స్ నుండి కొన్ని ఫోటోలను షేర్ చేసాడు. అవి క్యూరియాసిటీని పెంచాయి. ఫోటోలు లైట్ స్టేజ్ టెక్నాలజీని ఉపయోగించారని కూడా టాక్ వచ్చింది. ఈ టెక్నాలజీతో సబ్జెక్ట్ తాలూకా 3D వెర్షన్‌ను రూపొందించగలరు. మెరుగైన ఫలితాల కోసం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని యూజ్ చేయగలరు. 'గోట్' సినిమాలో ఈ టెక్నాలజీని ఉపయోగించడానికి కారణం తెలియకపోయినా కానీ.. వెంకట్ ప్రభు తన గత చిత్రాల కంటే భిన్నంగా ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. 'వెల్కమ్ టు ది ఫ్యూచర్' అని క్యాప్షన్ తో పోస్టర్లు రిలీజ్ చేయడంతో అది కాస్తా అంచనాలను పెంచేస్తోంది. ఒకవేళ ఇది కూడా ప్రభాస్ - నాగ్ అశ్విన్ తరహా సైన్స్ ఫిక్షన్ ప్రయోగం అవుతుందా? అన్నది కూడా ఇప్పుడే చెప్పలేం!!
GOAT -గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఒక మల్టీ స్టారర్ మూవీ. ఈ చిత్రంలో విజయ్, మీంకాశీ చౌదరి, ప్రశాంత్, స్నేహ, లైలా, ప్రభుదేవా, జయరామ్, మోహన్, అజ్మల్, యోగి బాబు, VTV గణేష్, వైభవ్, ప్రేమ్జీ అమరేన్, ఆకాష్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం యువన్ శంకర్ రాజా స్వరాలు సమకురుస్తున్నారు.