ఎన్టీఆర్ -ప్ర‌శాంత్ నీల్ క‌థ ఇదేనా?

ఈ నేప‌థ్యంలో తాజాగా నిర్మాత‌ల్లో ఒక‌రైనా మైత్రీ మూవీ మేక‌ర్స్ ర‌వి దీన్ని నెక్స్ట్ లెవ‌ల్ యాక్ష‌న్ చిత్రంగా రివీల్ చేసారు.;

Update: 2025-03-04 21:30 GMT

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆన్ సెట్స్ లో ఉంది. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జ‌రుగుతోంది. ఎన్టీఆర్ లేని స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తున్నారు. ఇదీ ప్ర‌శాంత్ నీల్ మార్క్ హై ఆక్టేన్ యాక్ష‌న్ చిత్ర‌మ‌న్నది క‌న్ప‌మ్. ఎన్టీఆర్ తో స్టైలిష్ యాక్ష‌న్ ని హైలైట్ చేస్తున్నాడు. అయితే క‌థా నేప‌థ్యం ఏంటి? అన్న‌ది ఇంత వ‌ర‌కూ ఎక్క‌డా లీక్ కాలేదు.

ఈ నేప‌థ్యంలో తాజాగా నిర్మాత‌ల్లో ఒక‌రైనా మైత్రీ మూవీ మేక‌ర్స్ ర‌వి దీన్ని నెక్స్ట్ లెవ‌ల్ యాక్ష‌న్ చిత్రంగా రివీల్ చేసారు. అలాగే ఇది 1960 బ్యాక్ డ్రాప్ గోల్డెన్ ట్ర‌యాంగిల్ గా పిల‌వ‌బ‌డే స‌ముద్ర తీర ప్రాంతంలో జ‌రిగే డ్ర‌గ్ మాఫియా స్టోరీ అని తెలుస్తోంది. ఈ క‌థ‌కు నీల్ ఓ స్పెష‌ల్ బ్యాక్ డ్రాప్ క్రియేట్ చేసి అవ‌స‌రం మేర భారీ సెట్లు వేయిస్తున్నాడు. అయితే క‌థ ఎక్కువ‌గా తీరానికి సంబంధించింది కావ‌డంతో స‌ముద్రం లో చాలా స‌న్నివేశాలుంటాయ‌ని చిత్ర వ‌ర్గాలు అంటున్నాయి.

సెట్స్ లో కొంత పార్ట్ షూటింగ్ జ‌రిగినా? కీల‌క‌మైన యాక్ష‌న్ స‌న్నివేశాలు సీ బ్యాక్ డ్రాప్లో నే ఉంటాయ‌ని తెలుస్తోంది. అయితే ఈ స‌న్నివేశాల‌ను ప్ర‌శాంత్ నీలో ఏపీ తీరంలో కాకుండా క‌ర్ణాట‌క‌, గోవా తీర ప్రాంతాల్లో ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. అవ‌సరం మేర అక్క‌డ కూడా కొన్ని సెట్లు వేయాల‌న్న‌ది ప్లాన్ అట‌. ఏపీలో షూటింగ్ అయితే అభిమానుల తాకిడి ఎక్కువ‌గా ఉంటుంద‌ని నీల్ ఇలా ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇప్ప‌టికే టూరిజం శాఖ‌ అనుమ‌తుల కోసం ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం తార‌క్ 'వార్ 2' షూటింగ్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈనెల‌లో 'వార్ 2' ముగించి ప్ర‌శాంత్ నీల్ ప్రాజెక్ట్లో పాల్గొంటాడు. ఇప్ప‌టికే తార‌క్ ఎంట్రీకి సంబంధించి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.

Tags:    

Similar News