అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. మొదటి ఆయుధం క్లిక్కయినట్లేనా?
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్.. రీసెంట్ గా పట్టుదల మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్.. రీసెంట్ గా పట్టుదల మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు ఆయన ఫుల్ యాక్షన్ మూవీ గుడ్ బ్యాట్ అగ్లీతో థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఏప్రిల్ 10న రిలీజ్ కానుందీ చిత్రం.
అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీలో త్రిష్ హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా వారిద్దరూ పట్టుదలతో సందడి చేయగా.. ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఇప్పటికే ఆడియన్స్ లో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కచ్చితంగా మూవీ హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
అదే సమయంలో రీసెంట్ గా మేకర్స్ ప్రమోషన్ లో భాగంగా మొదటి ఆయుధంగా టీజర్ ను రిలీజ్ చేశారు. అయితే దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మూవీ సూపర్ హిట్ పక్కా అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. ఫుల్ హ్యాపీగా కూడా ఉన్నారు. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీతో అజిత్ కు మంచి విజయం కచ్చితంగా దక్కుతుందని అంటున్నారు.
సినిమాలో అజిత్ రోల్ డిఫరెంట్ షేడ్స్ తో ఉన్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. టీజర్ స్టార్టింగ్ లో రెడ్ డ్రాగన్ గా ఆయనను పరిచయం చేశారు మేకర్స్. ఆ తర్వాత వివిధ గెటప్స్ లో ఓ రేంజ్ లో కనిపించారు. లుక్స్ అన్నీ అదుర్సే. ముఖ్యంగా అజిత్ యంగ్ వెర్షన్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. జోక్స్, డైలాగ్స్ తో మెప్పించారు.
టీజర్ లో అజిత్ యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంటున్నాయి. కొత్త కాన్సెప్ట్ తో డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ మూవీ తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది. అజిత్ అసాధారణమైనదాన్ని ప్రయత్నిస్తున్నారని చాలా స్పష్టంగా ఉంది. దీంతో అభిమానులకు ఆయన ఫుల్ మీల్స్ ఇవ్వనున్నారని క్లియర్ గా అర్థమవుతోంది.
ఇక మూవీ విషయానికొస్తే.. గుల్షాన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ సమర్పణలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు. సునీల్, ప్రసన్న తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. మరి సమ్మర్ కానుకగా రిలీజ్ కానున్న గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.