గూగుల్ టాప్ 10లో ఉండటం గర్వకారణం కాదు
ఈ విషయమై ఆమె స్పందిస్తూ అసహనం వ్యక్తం చేసింది, ఇది తాను సంతోషించే విషయం కాదని చెప్పుకొచ్చింది.
గూగుల్ ప్రతి ఏడాది డిసెంబర్‌లో అత్యధికంగా సెర్స్ అయిన వ్యక్తులు, సినిమాలు, సంఘటనలు ఇలా పలు విభాగాలకు చెందిన జాబితాను విడుదల చేయడం జరుగుతుంది. 2024లో అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ కాబడిన వారి జాబితాను, సంఘటనల జాబితాను గూగుల్ విడుదల చేయడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ సెర్చ్‌ను వినియోగించే వారు కోట్లాది మంది ఉంటారు. గూగుల్ విడుదల చేసిన టాప్ సెర్చ్ నటీనటుల జాబితాలో బాలీవుడ్ నటి హీరా ఖాన్ పేరు ఉంది. ఈ విషయమై ఆమె స్పందిస్తూ అసహనం వ్యక్తం చేసింది, ఇది తాను సంతోషించే విషయం కాదని చెప్పుకొచ్చింది.
గూగుల్ సెర్చ్‌లో టాప్ 10లో నిలిచిన హీరా ఖాన్ తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంది. ఈ ఏడాది మొత్తం ఆమె అనారోగ్యం గురించిన చర్చలు సోషల్ మీడియా ద్వారా, ఇంటర్నెట్‌లో చర్చ జరిగాయి. అందుకే ఆమెను గురించి గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేయడం జరిగింది. ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం కోసం, ఆమె సినిమాల గురించి తెలుసుకోవడం కోసం, ఆమె ఏ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు అనే విషయాలను తెలుసుకోవడం కోసం గూగుల్‌ను నెటిజన్స్ ఆశ్రయించడం జరిగింది. అందుకే ఆమె టాప్ 10 లో నిలిచింది.
గూగుల్ సెర్స్‌లో టాప్ 10లో నిలవడం పై హీరా ఖాన్ స్పందిస్తూ.. ఈ ఏడాది గూగుల్ సెర్స్‌లో టాప్ 10లో నా పేరు ఉండటంతో చాలా మంది నన్ను అభినందిస్తూ మెసేజ్‌లు చేస్తున్నారు, కాల్స్ చేశారు, సోషల్ మీడియాలోనూ నాకు తెలిసిన వారు, నన్ను అభిమానించే వారు అభినందిస్తూ పోస్ట్‌లు పెట్టడం చూశాను. నిజం చెప్పాలంటే ఇది నాకు ఏ మాత్రం గర్వకారణం కాదు. నేను ఏమీ గొప్పగా సాధించలేదు. కనుక ఈ విషయంలో నేను గర్వించడం లేదు. ఎవరూ అనారోగ్యంకు సంబంధించిన వార్తలతో ఇలా టాప్ 10 లో ఉండాలి అనుకోరు. ఇది నాకు సంతృప్తిని కలిగించలేదు.
నా జర్నీలో ఎంతో మంది అభిమానంను, ప్రేమను సొంతం చేసుకున్నాను. ఆ సమయంలోనే నాకు చాలా మంది ప్రశంసలు దక్కాయి. అందుకు నేను ఎప్పుడూ కృతజ్ఞురాలిని, తన అరోగ్య పరిస్థితి బాగాలేని సమయంలో నా వర్క్ గురించి, నా విజయాల గురించి, నేను చేసిన ప్రాజెక్ట్‌ల గురించి చర్చించి ఉంటే బాగుండేది. అనారోగ్యం గురించి, తన ఆరోగ్య పరిస్థితి గురించి గూగుల్‌లో సెర్చ్ చేసినంత మాత్రాన నేను గొప్పగా అనుకోవడానికి ఏమీ