ప్ర‌భాస్ తో గోపీచంద్ సినిమా ఏమ‌న్నాడంటే?

వాళ్లిద్ద‌రు క‌లిసి న‌టించిన‌ ఒకే ఒక్క సినిమా ఇంత‌వ‌ర‌కూ అదొక్క‌టే.

Update: 2024-10-09 23:30 GMT

ప్ర‌భాస్-గోపీచంద్ క్లోజ్ ప్రెండ్స్ అన్న సంగ‌తి తెలిసిందే. న‌టులు కాక‌ముందే ఇద్ద‌రు చెడ్డీ దొస్తులు. న‌టులుగా అరంగేట్రం చేసిన త‌ర్వాత వ‌ర్షం సినిమాలో క‌లిసి న‌టించారు. అందులో ప్ర‌భాస్ హీరో కాగా, గోపీచంద్ విల‌న్ పాత్ర పోషించాడు. వాళ్లిద్ద‌రు క‌లిసి న‌టించిన‌ ఒకే ఒక్క సినిమా ఇంత‌వ‌ర‌కూ అదొక్క‌టే. ఆ త‌ర్వాత మ‌ళ్లీ క‌లిసి ప‌నిచేయ‌లేదు. నేడు ప్ర‌భాస్ పెద్ద పాన్ ఇండియా స్టార్ అన్న సంగ‌తి తెలిసిందే.

న‌టుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆస్థాయికి చేరుకున్నాడు. ఇప్పుడు ప్ర‌భాస్ ఏ డైరెక్ట‌ర్ తో సినిమా తీసినా? అది 1000 కోట్ల వ‌సూళ్ల రేంజ్ ఉన్న సినిమా లెక్క‌. ఆ సంగ‌తి ప‌క్క‌న బెడితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో గోపీచంద్ కి ఓ ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న ఎదురైంది. `విశ్వం` ప్ర‌మోష‌న్ లో భాగంగా ప్ర‌భాస్ తో క‌లిసి సినిమా ఎప్పుడు చేస్తున్నారు? అంటే త‌న మ‌న‌సులో మాట చెప్పాడు. `నాకు న‌టించాల‌ని ఉంది. కానీ అన్నీ సెట్ అవ్వాలి. అది ఎప్పుడు జ‌రుగుతుందో నాకు కూడా తెలియ‌దు. కుదిరిప్పుడు త‌ప్ప‌కుండా చేస్తాం` అని అన్నాడు.

ప్ర‌భాస్ ఇంత‌వ‌ర‌కూ ఇత‌ర స్టార్ల‌తో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేసింది లేదు. అన్నీ సోలో సినిమాలే చేసాడు. సోలోగానే బాక్సాఫీస్ ని షేక్ చేసే స‌త్తా ఉన్న న‌టుడు. ఇటీవ‌ల రిలీజ్ అయిన `క‌ల్కి 2898` చిత్రం త‌ర్వాత ప్ర‌భాస్ ప్ర‌యోగాల‌కు ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌ని న‌టుడ‌ని ప్రూవ్ అయింది. అందులో అమితాబ‌చ్చ‌న్ తో పోలిస్తే ప్ర‌భాస్ రోల్ ఏమంత బ‌లంగా ఉండ‌దు. సినిమాలో అమితాబ‌చ్చ‌న్ హీరోగానే సాగుతుంది.

దీనికి ఇంకా కొన‌సాగింపు పార్ట్ -2 ఉంది? అందులో డార్లింగ్ పాత్ర ఎలా ఉంటుంది? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ లు కొన్ని ఉన్నాయి. `రాజాసాబ్`, `పౌజీ` త‌ర్వాత సందీప్ రెడ్డి వంగ‌తో `స్పిరిట్` చిత్రాన్ని ప‌ట్టాలెక్కిస్తాడు.

Tags:    

Similar News