గోపీచంద్ కోసం మ‌రో ఇద్ద‌రు క్యూలోనా!

టాలీవుడ్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని బాలీవుడ్ డెబ్యూ `జాట్` తో భారీ విజ‌యం అందుకున్నాడు.;

Update: 2025-04-14 07:28 GMT
Gopichand Malinenis Jaat Gains Success

టాలీవుడ్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని బాలీవుడ్ డెబ్యూ `జాట్` తో భారీ విజ‌యం అందుకున్నాడు. గోపీ అనుకున్న క‌మ‌ర్శియ‌ల్ పార్ములా అక్క‌డా వ‌ర్కౌట్ అయింది. ఇప్ప‌టికే సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల‌తో దూసుకుపోతుంది. ఏప్రిల్ 10న రిలీజ్ అయిన సినిమాకు మంచి ఓపెనింగ్స్ ద‌క్కాయి. పోటీగా మ‌రో హిందీ చిత్రం కూడా లేక‌పోవ‌డంతో జాట్ కి ఈ వారం కూడా బాగానే క‌లిసొస్తుంది. స‌న్నిడియోల్ యాక్ష‌న్ స‌న్ని వేశాల‌కు నార్త్ ఆడియ‌న్స్ బాగా క‌నెక్ట్ అవుతున్నారు.

ఇడ్లీ పైట్ ఇప్పుడు మార్కెట్ లో ఊపేస్తుంది. ఇంట‌ర్నెట్ లో లీక్ అయిన ఆ ఫైట్ స‌న్నివేశం యాక్ష‌న్ ప్రియుల్ని అల‌రిస్తుంది. దీంతో తెలుగు రిలీజ్ కోసం ఆడియ‌న్స్ యాక్ష‌న్ ఆడియ‌న్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అంతే కాదు బాలీవుడ్ హీరోల‌కు ఈ ఫైట్ బాగా క‌నెక్ట్ అయింది. దీంతో గోపీచంద్ కోసం అప్పుడే ఇద్ద‌రు యాక్ష‌న్ స్టార్లు క్యూలో ఉన్నారంటూ ప్ర‌చారం మొద‌లైంది.

అజ‌య్ దేవ‌గ‌ణ్‌, టైగ‌ర్ ష్రాప్ ఇలాంటి యాక్ష‌న్ స్టోరీలో న‌టించాల‌ని ఉంద‌నే ఆస‌క్తి వ్య‌క్తం చేస్తున్నారుట‌. `జాట్` లో యాక్ష‌న్ స‌న్నివేశాలు బాలీవుడ్ లో యాక్ష‌న్ మేకింగ్ కి డిఫ‌రెంట్ గా ఉండ‌టంతో ఈ న‌యా స్టార్లు ఇద్ద‌రు ఇంట్రెస్ట్ గా ఉన్న‌ట్లు తెలుస్తుంది. ఇది టాలీవుడ్ మాస్ యాక్ష‌న్ కావ‌డం అక్క‌డ ఆడియ‌న్స్ స‌హా హీరోల‌కు కొత్త అనుభూతి క‌లుగుతుంది. అందుకే ఈ న‌యా స్టార్లు ఆస‌క్తిగా ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది.

అజ‌య్ దేవ‌గ‌ణ్, టైగ‌ర్ ష్రాఫ్ ఇద్ద‌రు భారీ యాక్ష‌న్ స్టార్లే. యాక్షన్ లో వాళ్ల‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ఉంది. మ‌రి ఇద్ద‌రు కాన్పిడెంట్ గా ముందుకొస్తే గోపీచంద్ కి ఎలాంటి అభ్యంత‌రం ఉండ‌దు. టాలీవుడ్ లో స్టార్ హీరోలంతా బిజీగా ఉన్న నేప‌థ్యంలో అత‌డికి హీరోలు అవ‌స‌రం ఉంది. అజ‌య్...టైగ‌ర్ లాంటి టాప్ స్టార్లు ముందుకొస్తే అత‌డెందుకు కాదంటాడు.

Tags:    

Similar News